Karthika Deepam2 : జ్యోత్స్నకి ఇచ్చిపడేసిన శివన్నారాయణ.. కార్తీక్ ఆన్ ఫైర్!
on Nov 3, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీకదీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 505 లో.. సుమిత్ర, దశరథ్ ల పెళ్ళి రోజు కోసమని కార్తీక్, దీప కేక్ తీసుకొస్తారు. దానికి శ్రీధర్, కాంచన కూడా వస్తారు. కాసేపటికి ఇద్దరు కేక్ కట్ చేస్తారు. శివన్నారాయణ, పారిజాతం, జ్యోత్స్న, అందరు వరుసగా కేక్ తినిపిస్తారు. ఇక జ్యోత్స్న పుల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది.
మీరంతా అన్నట్లుగా బావకు దీపకు నిజంగానే భార్యభర్తలను కలిపేంత సమర్థత ఉంటే అత్తను మావయ్యను ఇంత వరకూ ఎందుకు కలపలేదు.. ఏం బావా... మా అమ్మనాన్నల గురించే ఆలోచిస్తావా.. మీ అమ్మానాన్నల గురించి ఆలోచించావా అంటూ జ్యోత్స్న వెటకారంగా అడుగుతుంది. జ్యోత్స్నా అని దశరథ్ అనగానే.. ఏం డాడీ.. మీ బావ మీ చెల్లెలు కలిసి ఉండాలని మీరు కోరుకోవడం లేదా.. నాకు ఏదో గుర్తొస్తుంది. కన్నతల్లి పిన్నతల్లి.. మా గ్రానీ నువ్వే ఆ సామెత చెప్పేదానివి ఏంటదని జ్యోత్స్న అంటుంది. ఇక శివన్నారాయణ అందుకొని వాళ్లు కలిసే ఉన్నారంటూ మాటలతోనే కలిపేస్తాడు.
దీప, కార్తీక్‌ల పెళ్లికి మీ శ్రీధర్ మావయ్య భార్యతో వచ్చాడా ఒంటరిగా వచ్చాడా అని అడుగుతాడు.. అత్తతోనే వచ్చాడని జ్యోత్స్న అంటుంది. సత్యనారాయణ వ్రతం జంటగా ఉన్నారా లేదా అని అనగా..జంటగానే ఉన్నారని జ్యోత్స్న అంటుంది. మరి ఈ రోజు.. జంటగానే కనిపిస్తున్నారు కదా అని శివన్నారాయణ అనగానే.. కనిపిస్తున్నారని జ్యోత్స్న అంటుంది. మరి విడిపోయారని నువ్వు ఎలా చెబుతావ్.. కళ్లు కనిపిస్తున్నాయి కదా.. నోటికి ఏదొస్తే అది అంటావా అని శివన్నారాయణ అనగానే జ్యోత్స్న తలదించుకుంటుంది. ముందు ఆలోచిస్తే నోటికి రావాల్సిన మాటలే వస్తాయని కార్తీక్ కోపంగా అంటాడు. నేను కాంచన వేరు అని నేనెప్పుడు అనుకోలేదు.. మేమంతా ఒకటే అని శ్రీధర్ అంటాడు. విన్నావ్‌గా.. ఈసారైనా వినపడిందా.. ఏదొకటి అవకాశం చూసుకుని ఎదుటివారిని అనడమే.. అసలు నీ చేతకానీతనం వల్లే కదా ఇదంతా జరిగిందంటూ శివన్నారాయణ అరుస్తాడు. పారు అడ్డుపడుతుంది. దాంతో కాస్త శాంతించిన శివన్నారాయణ.. పదండి అంతా తిందాం.. దశరథా పదా.. పారిజాతం రా అని అనవడంతో అందరు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



