Karthika Deepam2 : జ్యోత్స్న, గౌతమ్ ల ఎంగేజ్ మెంట్.. పెళ్ళిలో వాళ్ళిద్దరు ఉండొద్దంట!
on Jul 5, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -401 లో..... అసలు జ్యోత్స్న ఏం చేసిన అది తెలియకుండా చేసిందే తప్పా.. కావాలని కాదు.. జ్యోత్స్న తప్పు చేసిందన్నారు కానీ ఇప్పుడు మామయ్య గారిని తీసుకొని మరి వదినని చూడడానికి వెళ్ళిందని దశరథ్ తో సుమిత్ర అంటుంది. మీరు నన్ను ఇలా అనుకోవాలనే కదా.. నేను తాత బ్రతిమిలాడి మరి తీసుకొని వెళ్ళిందని జ్యోత్స్న అనుకుంటుంది.
నన్ను నువ్వు ఒక్కదానివి నమ్మితే చాలు మమ్మీ ఎందుకు అంటే డాడ్ ఎప్పుడు నన్ను నమ్మాడని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. జ్యోత్స్న ని నేను ఎప్పుడు నమ్మలేను.. అసలు దాస్ ని ఎందుకు చంపాలనుకుందో తెలిసేవరకు అని దశరథ్ అనుకుంటాడు. ఆ తర్వాత శివన్నారాయణ వచ్చి.. రేపు ఎవరు ఎక్కడికి వెళ్ళకండి.. గౌతమ్ తన పేరెంట్స్ తో ముహూర్తం పెట్టించడానికి వస్తున్నాడని అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. మరుసటిరోజు ఉదయం జ్యోత్స్న రెడీ అవుతుంది. గ్రానీ నేను చెప్పినట్టు చెయ్ అని పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న.
ఆ తర్వాత గౌతమ్ తన పేరెంట్స్ ని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వస్తాడు. దీప, కార్తీక్ ఇద్దరు మర్యాదలు చేస్తూ సందడి చేస్తుంటారు. అప్పుడే పారిజాతం వచ్చి జ్యోత్స్న కిందకి రాలేదు.. పాపం జ్వరం వచ్చిందని అనగానే జ్యోత్స్న దగ్గరికి వెళ్తాడు కార్తీక్. గౌతమ్ వాళ్ళ అమ్మని సుమిత్ర తీసుకొని వెళ్తుంది. నీ దగ్గరికి గౌతమ్ ని కూడా రమ్మని అంటావా అనగానే వద్దని జ్యోత్స్ననే కిందకి వస్తుంది. ఆ తర్వాత జ్యోత్స్న, గౌతమ్ ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం పెడతారు. గౌతమ్ వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళ అమ్మ ఆగి ఎంగేజ్ మెంట్ లో దీప కార్తీక్ మాత్రం ఉండొద్దని సుమిత్రకి చెప్పి వెళ్తుంది. అప్పుడే శ్రీధర్ పారిజాతానికి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



