Karthika Deepam2 : జ్యోత్స్నపై దశరథ్ కి డౌట్.. ఆ గెటప్ లో పారిజాతం!
on May 14, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -356 లో... శివన్నారాయణ ఇంటికి కార్తీక్ వచ్చి మాట్లాడి వెళ్ళాక పారిజాతం జ్యోత్స్నని పైకి తీసుకొని వెళ్తుంది. ఆ దీప పై ఎటాక్ చేసింది నువ్వేనా దశరత్ ని షూట్ చేసింది నువ్వేనా అని పారిజాతం అడుగుతుంది. ఎందుకు నాపై డౌట్ పడుతున్నావని జ్యోత్స్న అడుగుతుంది. మరి కార్తీక్ అలా మాట్లాడి వెళ్తుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావని పారిజాతం అడుగుతుంది. దాంతో కార్తీక్ సంతకం పెట్టిన పేపర్ తీసుకొని వచ్చి చూపిస్తుంది జ్యోత్స్న.
ఈ అగ్రిమెంట్ గురించి ఏదైనా చెప్తాడని భయపడ్డానని జ్యోత్స్న అంటుంది. ఇలా బావని బ్లాక్ మెయిల్ చేశాను. దాంతో బావ సంతకం పెట్టాడు. ఇక మనకి నచ్చింది ఈ పేపర్ పై రాసుకోవచ్చని జ్యోత్స్న అంటుంది. సరే గాని నేను చెప్పినట్లు చెయ్ అంటూ ఏదో ప్లాన్ పారిజాతానికి జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు దీపని కార్తీక్ ఇంటికి తీసుకొని వస్తాడు. అనసూయ దిష్టి తీస్తుంది. లోపలికి వచ్చాక శౌర్యని హగ్ చేసుకొని దీప ఎమోషనల్ అవుతుంది. మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్లారని కాంచన కోప్పడుతుంది. వాళ్ళు హెల్ప్ చేయకున్న నా భార్యని కాపాడుకున్నానని చెప్పడానికి వెళ్లానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత దీప లోపలికి వెళ్తుంది. అమ్మ నువ్వు అనుకున్నదే జరిగిందని.. దీపనే నీ మేనకోడలు.. తననే కోడలు చేసుకున్నావని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
మరొకవైపు దశరథ్ కి జ్యూస్ ఇస్తుంది జ్యోత్స్న. దీపపై ఎటాక్ వెనుక ఖచ్చితంగా జ్యోత్స్న ఉండి ఉంటుందని దశరథ్ అనుకుంటాడు. డాడ్ కి నాపై డౌట్ వచ్చిందని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అయినా నువ్వు దీపని ఎందుకు పలకరించావ్ డాడ్ అని జ్యోత్స్న అడుగుతుంది. దీప ఒకరి ప్రాణం తీసేంత కఠినమైన మనిషి కాదు.. అయినా దీప చేతిలో ఉన్న గన్ నుండి బుల్లెట్ రాలేదని తెలిసింది కదా నన్ను షూట్ చేసినవాళ్లు దీపని ఎటాక్ చేసినవాళ్లు ఒకరే అయి ఉంటారు త్వరలోనే తెలుస్తుందని దశరథ్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత చెత్త ఏరుకునే గెటప్ లో పారిజాతం రెడీ అయి దీప ఇంటికి వెళ్లి అక్కడ జరుగుతున్న సిచువేషన్ తెలుసుకోవాలని అనుకుంటుంది. పారిజాతం ఆ గెటప్ లో దీప ఇంటికి వెళ్తుంది. ఎవరు అని అనసూయ బయటకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



