ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2 : శౌర్య సూపర్ ట్యాలెంట్.. జ్యోత్స్నని రెచ్చగొడుతున్న పారిజాతం !

on May 16, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -45 లో.....దీప, కడియం ఇద్దరు కలిసి హోటల్ ని స్టార్ట్ చేస్తారు. వచ్చిన కస్టమర్స్ అందరు టిఫిన్ బాగుందని చెప్తారు. ఆ తర్వాత కార్తీక్ వచ్చి టిఫిన్ చేస్తాడు. బాగుంది ఉప్మా అని మెచ్చుకుంటాడు. ఇలాంటివి మా రెస్టారెంట్ లో కూడా ట్రై చెయ్యాలని కార్తీక్ అనగానే.. బాబు మీకు రెస్టారెంట్ లు కూడా ఉన్నాయా అని కడియం ఆశ్చర్యపోతాడు.

ఆ తర్వాత కార్తీక్ డబ్బులు ఇవ్వబోతుంటే.. మీ డబ్బులే మా దగ్గర ఉన్నాయని కడియం అంటాడు... సరే ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని కార్తీక్ అనగానే... మీరు వచ్చిన పని అయిపోయింది కదా ఇక వెళ్ళండి అని దీప అంటుంది‌. దాంతో కార్తీక్ వెళ్ళిపోతాడు. మరోవైపు జ్యోత్స్న కి సుమిత్ర పాలు తీసుకొని వస్తుంది. నీతో కోపంగా మాట్లాడినందుకు సారి అని జ్యోత్స్న చెప్తుంది. దీప తప్పు చేసే మనిషి కాదని సుమిత్ర అనగానే.. అంటే బావ తప్పు చేసే మనిషా అని జ్యోత్స్న అంటుంది. దీపకి ఈ ఇంటికి సంబంధం లేదు కానీ నాకు బాగా దగ్గర అయింది.. దీప జీవితం చక్కపెట్టాలనిపిస్తుందని సుమిత్ర అనగానే.. నువ్వు చేస్తే సాయంగా ఉంది.. అదే బావ చేస్తే వేరేగా ఉందని జ్యోత్స్న అంటుంది.. నువ్వు నా కూతురువి దీప కాదు.. ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలని సుమిత్ర చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడేం చేయాలి అనవసరంగా ఇంటికి తీసుకొని వచ్చి తప్పు చేసానని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత దశరథ్ క్యూబ్ సెట్ చేస్తుంటే.. అప్పుడే శౌర్య వచ్చి నిమిషంలో లో సెట్ చేస్తుంది. దాంతో దశరథ్ షాక్ అవుతాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. అతని ముందు కూడా శౌర్య క్యూబ్ ని సెట్ చేస్తుంది. దీనికి మంచి టాలెంట్ ఉంది.. మంచి స్కూల్ లో జాయిన్ చేద్దామని దశరత్ అనగానే.. వాళ్ళ అమ్మ కి చెప్పకుండా వెళ్తే ఏమైనా అనుకుంటుందేమోనని అలోచించి సుమిత్ర స్కూల్ లో జాయిన్ చేయమందని చెప్దామని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత శౌర్యని తీసుకొని వెళ్తాడు.

కార్తిక్, శౌర్య వెళ్తుంటే.. దీప ఆపుతుంది. మీరెందుకు తీసుకొని వెళ్తున్నారని దీప అడుగుతుంది. స్కూల్ లో జాయిన్ చెయ్యడానికి అని కార్తీక్ అనగానే.. అవసరం లేదని దీప అంటుంది. ఆ తర్వాత వాళ్ళు అలా మాట్లాడుకుంటే వాళ్ళని చూస్తే దీప, కార్తీక్ ఇద్దరు భార్యభర్తలని‌.. వాళ్ళకి ఒక పాప అన్నట్టుందని జ్యోత్స్నతో పారిజాతం చెప్తుంది.. ఆ తర్వాత నేనే స్కూల్ లో జాయిన్ చేస్తానని దీప అనగానే కార్తీక్ వెళ్ళిపోతాడు. చూసావా కార్తీక్ తనని పంపిస్తున్నాడంటు జ్యోత్స్నకి కోపం వచ్చేలా పారిజాతం మాట్లాడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.