ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam2 : దీపకి అండగా సుమిత్ర.. కూతురి కోసం తల్లి జాబ్!

on May 11, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -41 లో... అంత గొప్పింట్లో ఉంటూ... నా దగ్గర పని చెయ్యాలిసిన అవసరేమేంటి దీప అని కడియం అడుగుతాడు. నేను ఒకావిడని ప్రమాదం నుండి కాపాడాను.. ఆవిడ మేనల్లుడు అతను. నేను కొన్ని రోజులు అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే అక్కడే ఉంటున్నానని దీప అనగానే.. అంటే నువ్వు ఊరు వెళ్ళిపోతావా అని కడియం అడుగుతాడు.

నువ్వేం కంగారుపడకు బాబాయ్.. నేను ఇక్కడే ఉంటాను.. నా కూతురిని బాగా చదివించాలని దీప అంటుంది. ఇక రేపు ప్రొద్దున టిఫిన్ కి అంత సిద్ధం చెయ్.. ప్రొద్దునే వస్తానని కడియంకి  దీప చెప్పి వెళ్ళిపోతుంది. దీప వెళ్ళిపోయాక అయ్యో తన భర్త గురించి అడగడం మర్చిపోయానని కడియం అనుకుంటాడు. మరొకవైపు కోడలు పిల్ల కాఫీ తీసుకొని రా అని శోభని అనసూయ పిలుస్తుంది. ఆ దీప ఇక్కడ ఉన్నంత వరకే ఇలా.. అది ఉరెళ్ళాక నిన్ను నీ కొడుకు చేతనే బయటకు గెంటేస్తానని శోభ అనసూయ గురించి అనుకుంటుంది. ఆ తర్వాత ఆ దీప ఇక్కడ ఉండడానికి వీళ్లేదు పంపించేయ్యండి.. వాళ్ళింట్లో ఉంటే బలవంతంగా దీప చేత కేసు పెట్టిస్తారని నర్సింహకి శోభ చెప్తుంది. దాని మాటలు పట్టుకొని ఆ దీప జోలికి వెళ్ళకని నర్సింహకి అనసూయ చెప్తుంది.

శౌర్యకి దీప అన్నం తినిపిస్తుంది. నానమ్మ ఎక్కడ అని శౌర్య అడుగుతుంది. అప్పుడే సుమిత్ర వచ్చి.. శౌర్యని లోపలికి పంపిస్తుంది. మీ అత్తయ్య అక్కడకి వెళ్లిన పని ఏమైందని అడుగుతుంది.. ఇక దీప అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది. నేను నా కూతురు అంతే నా కూతురు బాగా చదివించుకుంటాను.. హోటల్ లో జాబ్ చూసుకున్నానని దీప చెప్తుంది... నువ్వెందుకు పని చెయ్యడం.. నేను నిన్ను చూసుకుంటానని సుమిత్ర అంటుంది. వద్దని దీప అంటుంది. నేను నీకు ఉన్నానని సుమిత్ర చెప్తుంది. అదంతా కార్తీక్ దూరంగా ఉండి వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.