Karthika Deepam2 : దీపకు బెయిల్.. నెగెటివ్ గా చెప్పిన జ్యోత్స్న!
on May 1, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -345 లో.... దీప చేతిలో ఉన్న గన్ పేలలేదు దశరథ్ ని షూట్ చేసింది ఆ గన్ లో ఉన్న బుల్లెట్ తో కాదని ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా జడ్జ్ చెప్తుంది. అదే టైమ్ కి ఎవరో గన్ తో షూట్ చేశారని దీప తరుపు లాయర్ వాదిస్తాడు. అలా కేసుని తప్పు దోవ పట్టించొద్దని భగవాన్ దాస్ అంటాడు. అసలు దీప ట్రిగర్ పై వేలు పెట్టలేదు అనడానికి సాక్ష్యాలు అంటూ శివన్నారాయణ ఇంట్లో సీసీటీవీ లో ఫుటేజ్ ఫొటోస్ కళ్యాణ్ ప్రసాద్ జడ్జ్ కి ఇస్తాడు. అది చుసి అవునని జడ్జ్ చెప్తుంది.
ఆ ఫొటోస్ మార్చి ఉండొచ్చు కదా అని భగవాన్ దాస్ అంటాడు. అదేం లేదు అది సర్టిఫిడ్ ఫోటోస్ అని కళ్యాణ్ ప్రసాద్ చెప్తాడు. అన్ని వాదనలు విన్న జడ్జ్ దీప ప్రమేయం లేదు కానీ ఎవరో కావాలనే షూట్ చేశారు.. వాళ్లెవరో కనుక్కోండి.. అప్పటివరకు దీపకి బెయిల్ మంజుర్ చేస్తున్నానని జడ్జ్ చెప్తుంది. అలాగే జ్యోత్స్నని ఇంటరాగేషన్ చెయ్యాలని చెప్తుంది. దీప బెయిల్ పై బయటకు వస్తున్నందుకు కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
ఆ తర్వాత అనవసరంగా మనమే దీపని తప్పుగా అర్థం చేసుకున్నామా అని శివన్నారాయణతో సుమిత్ర అంటుంది. అదేంటీ వీళ్ళు దీపకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అలా జరగకూడదని జ్యోత్స్న సుమిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చి.. దీపని కాపాడడానికి బావ లంచం ఇచ్చి ఇదంతా చేసాడంటూ నెగెటివ్ గా చెప్తుంది. ఆ తర్వాత సుమిత్ర, శివన్నారాయణ కలిసి కార్తీక్, దీపల దగ్గరికి వెళ్లి ఇంత దిగజారుతావనుకోలేదు.. నీ భార్యని కాపాడడానికి ఇలా చేస్తావా అంటూ కార్తీక్ పై కోప్పడతారు. దీప ఏ తప్పు చేయలేదని కార్తీక్ అంటాడు. అయిన వాళ్ళు వినకుండా అలాగే మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



