Karthika Deepam2 : శివన్నారాయణ ఇంటికి దీప.. జ్యోత్స్నకి కార్తీక్ వార్నింగ్!
on Feb 6, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -274 లో...... కార్తీక్, దీప లు శౌర్య దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఇక నువ్వు టాబ్లెట్ వేసుకునే అవసరం లేదని శౌర్యకి చెప్తాడు కార్తీక్. అప్పుడే డాక్టర్ వచ్చి.. పాపకి ఇంకేం ప్రాబ్లమ్ లేదని చెప్పగానే దీప, కార్తీక్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. శౌర్యని తీసుకొని ఇంటికి వెళ్ళగానే అనసూయ హారతి ఇస్తుంది. ఇంట్లోకి వచ్చిన శౌర్యని కాంచన ప్రేమగా దగ్గర కి తీసుకుంటుంది. అందరు శౌర్యని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. దూరం నుండి జ్యోత్స్న వచ్చి చూసి వెళ్లడం కార్తీక్ చూసి మళ్ళీ వస్తానంటూ వెళ్తాడు. జ్యోత్స్న కార్ కి కార్తీక్ సైకిల్ అడ్డుగా వదిలేస్తాడు. దాంతో జ్యోత్స్న కార్ ఆపుతుంది. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావంటూ కార్తీక్ తన విశ్వరూపం చూపిస్తాడు.
నువ్వు కావాలి బావ అని జ్యోత్స్న అనగానే.. కానీ నాకు నువ్వు వద్దని కార్తీక్ ఘాటుగా సమాధానం చెప్తాడు. నన్ను బాధపెడుతున్నావ్ బావ అని జ్యోత్స్న అంటుంది. ఇంతకు డబ్బు ఎవరు కట్టారని అనగానే కార్తీక్ అని కార్తీక్ చెప్తాడు. దాంతో జ్యోత్స్న షాకింగ్ గా చూస్తుంది. కాంచన వాళ్ళు టీ తాగుతుంటే.. అప్పుడే కార్తీక్ చిరాకుగా వస్తాడు. కాంచన తన టీ ఇస్తుంది. ఒరేయ్ శౌర్య హాస్పిటల్ లో ఉన్నప్పుడు పూజ చేపిస్తానని మొక్కుకున్నానని కాంచన అనగానే.. సరే అమ్మ నా కూతురు బాగుంది అది చాలు అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కాంచన అనసూయకి ఏదో చెప్పబోతు.. దీప ఉందని ఆగిపోతుంది. దీప వెళ్ళాక ఏంటి ఏదో చెప్పాలనుకున్నావని కాంచనని అనసూయ అడుగుతుంది. నేను ఇంట్లో చిన్న బర్త్డే చేసుకున్నా కూడా మా వాళ్లు వస్తారు. అలాంటిది ఇప్పుడు మా వాళ్ళు దూరం అయ్యారంటూ కాంచన ఎమోషనల్ అవుతుంది. నువ్వు బాధపడకు చెల్లి త్వరలోనే మీ వాళ్ళు కలుస్తారని కాంచనతో అనసూయ అంటుంది. అదంతా దీప వింటుంది.
సుమిత్ర బంగారం తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చి ఉంటుందా అని జ్యోత్స్న సుమిత్ర నగలు ఉన్నాయా లేవా అని చూస్తుంది. నగలు ఉండడంతో మరి వాళ్లకి డబ్బు ఎక్కడ నుండి వచ్చిందని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే సుమిత్ర వచ్చి.. నేనేం ఇవ్వలేదు.. నగలు తాకట్టు పెట్టి ఇచ్చానని చూస్తున్నావా అని సుమిత్ర అంటుంది. ఎవరు సాయం చేసారో కనుక్కుంటానని జ్యోత్స్న అంటుంది. అందరు హాల్లో ఉంటారు. శివన్నారాయణ ఇంటికి దీప వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



