Karthika Deepam 2: జ్యోత్స్నకి పారిజాతం వార్నింగ్.. కాంచన రిపోర్ట్స్ లో ఏం ఉందంటే..?
on Jan 2, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -556 లో... జ్యోత్స్న వల్లే కాశీ స్టేషన్ కి వెళ్ళాడని పారిజాతానికి కోపం వస్తుంది. దాంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది పారిజాతం. గర్వం తలకి ఎక్కితే పర్వాలేదు కానీ ఒళ్ళంతా విషంలాగా మారిందని తనపై కోప్పడుతుంది పారిజాతం. అసలు ఇందులో కాశీని కావాలనే ఇరికించింది బావ. కాశీని పోలీసులు అరెస్ట్ చేయకుండా బావ చేయొచ్చు.. వాళ్లని ఆపొచ్చు కానీ బావ అలా చెయ్యలేదని పారిజాతాన్ని జ్యోత్స్న డైవర్ట్ చేస్తుంది.
ఆ తర్వాత శ్రీధర్ భోజనానికి వస్తున్నాడని అనసూయ అన్ని రెడీ చేస్తుంది. శ్రీధర్ గారు రావడం ఒక్కటే లేటు అని కాంచనతో అనసూయ అంటుంది. నాతో మీ నాన్నగారు అంటావ్.. దీపతో మావయ్యగారు అంటావ్.. మా అమ్మతో మాత్రం శ్రీధర్ గారు అని ఎందుకు అంటావని కార్తీక్ అంటాడు. ఏం అంటార్ దీప అని కార్తీక్ అనగానే.. మీ ఆయన అనాలని దీప చెప్తుంది. పిల్లల కోసం పారుని పెళ్లి చేసుకున్నాడు తాత. నా కోసం నువ్వు నాన్నతో భార్యగా ఉండలేవా అని కార్తీక్ అంటాడు.
అప్పుడే శ్రీధర్, కావేరి, స్వప్న ఎంట్రీ ఇస్తారు. సారీ పెద్దమ్మ ఇన్ని ప్రాబ్లెమ్స్ కి కారణం నేనే అని స్వప్న అనగానే నువ్వు ఏం చేసావని కాంచన అడుగుతుంది. కాశీని పెళ్లి చేసుకున్నాను కదా.. ముఖ్యంగా నా వల్ల దీప వదిన ఎక్కువ బాధపడిందని స్వప్న అంటుంది.
మరొకవైపు సుమిత్రకి కాళ్ళునొప్పులు ఉన్నాయని దశరథ్ కాళ్ళు మసాజ్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తాడు. దాంతో దశరథ్ పక్కకి వెళ్లి మాట్లాడుతాడు. రేపు వచ్చి రిపోర్ట్స్ తీసుకోండి అలాగే డాక్టర్ మీతో మాట్లాడతారని చెప్పగానే ఏమైందో ఏమోనని దశరథ్ కి ఇంకా టెన్షన్ అవుతుంది.
మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు. అసలు కాశీ అలా అవ్వడానికి కారణం మీరేనని శ్రీధర్ తో కాంచన అంటుంది. మీరు మావయ్యగా వాడి మీద అధికారం చెలాయించాలనుకున్నారు.. వాడికి ఎలా ఉంటుందని కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



