Karthika Deepam2 : కాంచన గురించి శివన్నారాయణ దిగులు.. కార్తీక్, దీప ఎమోషనల్!
on Feb 6, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -586 లో.. శ్రీధర్, కాంచన దగ్గరికి వస్తాడు. నా ఇద్దరు పిల్లల బుద్ధి ఒక్కటే అని శ్రీధర్ అంటాడు. అలా ఏం కాదు.. కార్తీక్ వేరు.. వాడు కోపం ఎవరి మీద చూపించాలో వారి మీదనే చూపిస్తాడు.. స్వప్నలాగా మూర్ఖంగా మాట్లాడడని కొడుకుకి సపోర్ట్ చేస్తుంది కాంచన. దీప మా అన్నయ్యని షూట్ చేసిందని అందరు నమ్మారు కానీ వాడు నమ్మలేదు. అది భార్యపై ఉండే నమ్మకమని కాంచన అంటుంది.
స్వప్నకి మరొక పెళ్లి చేస్తానని శ్రీధర్ అనగానే కాంచన తనపై కోప్పడుతుంది. ఆడవాళ్ల మనసు ఎటిఎం కార్డ్ కాదు అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి ఇంకొకరిని తెచ్చుకోవడానికి అని కాంచన అంటుంది. స్వప్న నీకు కూతురు కాకపోయినా కూతురు అనుకున్నప్పుడు.. నీకు తాళి కట్టిన భర్తని భర్త అని ఎందుకు అనుకోవడం లేదని శ్రీధర్ అంటాడు. ఇక అక్కడే ఉన్న శివన్నారాయణ మధ్యలో కలుగజేసుకొని.. అల్లుడు అడిగిన దానికి సమాధానం చెప్పమని అంటాడు. నా కూతురి జీవితం చక్కదిద్దలేకపోతున్నానని శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు. నేనేం తప్పు చేశాను అందరిని చూసుకుంటాను.. అది తప్పా అని కాంచన ఎమోషనల్ అవుతుంది. కార్తీక్, దీప అప్పుడే వస్తారు. జ్యోత్స్న సాంపిల్స్ ఇవ్వడానికి హాస్పిటల్ కి వెళ్ళాము.. నిన్న వాళ్ళు హాస్పిటల్ లో కన్పించారు.. దీపకి ఏవో టెస్ట్ లట అని శివన్నారాయణ అనగానే దీప, కార్తీక్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు.
దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ నా కూతురు తల్లి అని శివన్నారాయణ అనగానే కార్తీక్ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటాడు. ఆ తర్వాత అనసూయ ఊరు నుండి వస్తుంది. అక్కడ విషయాలన్ని కాంచనకి చెప్తుంది. ఆ తర్వాత రాత్రి దీప, కార్తీక్ మాట్లాడుకుంటుంటే శౌర్య ఒక బొమ్మ తీసుకొని వెళ్లి.. ఇది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అంట కాదా అని అంటుంది. దాంతో కార్తీక్, దీప బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



