ENGLISH | TELUGU  
Home  » TV News

Karthika Deepam 2 : ఇంకొక అమ్మాయిని కంటే బాగుండేది.. భార్య మాటతో భర్త షాక్!

on May 12, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -42 లో...ఎవరు చూడకుండా పారిజాతం బంటూతో గోడ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. చేసిన పని బాగా చేస్తే ఇలా చాటుగా మాట్లాడే అవసరం వచ్చేది కాదు కదా అని పారిజాతం అంటుంది. అంత ఆ పిల్ల దెయ్యం చేసిందని బంటు అనగానే... ఆ పిల్లని ఏం అనకురా ఇప్పుడు తల్లి కంటే పిల్లకే ఎక్కవ అభిమానులు ఉన్నారని పారిజాతం అంటుంది. అందరికి భయపడుతూనే నేను గోడకి ఇవతలి పక్కనున్నానని బంటు అంటాడు.

ఆ తర్వాత ఆ దీపని ఇంట్లో నుండి పంపించెయ్యాలని ఇద్దరు అనుకుంటారు. నువ్వు దాని ఊరు వెళ్లి దానికి సంబంధించిన మొత్తం వివరాలు కనుక్కుంటే దాని బలహీనత తెలిస్తే దాని మీద దెబ్బ కొట్టొచ్చు.. నువ్వు ముందు వెళ్ళమని బంటుని పారిజాతం పంపిస్తుంది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం నర్సింహా.. దీపతో సుమిత్ర ఇంటికి వస్తాడు. ఇక్కడేం గొడవ చేయకని దీప అన్నా కూడా నర్సింహా వినిపించుకోడు.. అందరు హాల్లోకి వస్తారు. వాడెక్కడ అంటూ దీప జుట్టు పట్టుకుంటాడు నరసింహా. అప్పుడే కార్తీక్ వచ్చి నర్సింహా కాలర్ పట్టుకుంటాడు. నాకు తెలుసు దీన్నేం అననివ్వవని నరసింహ అంటాడు. అసలు నీకు వాడికి సంబంధమేంటి ? ఇద్దరు ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతున్నారు.. నా కూతురు నీ కూతురు అయినట్టు చూసుకుంటున్నావని నరసింహా తప్పుగా మాట్లాడుతుంటే.. నర్సింహాపై సుమిత్ర చెయ్యి చేసుకుంటుంది. దీపకి ఎవరు లేరు అనుకుంటున్నావా.. నేను ఉన్నాను అని సుమిత్ర అంటుంది. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో కూడా నాకు తెలియదని నర్సింహా అంటాడు.

దీప ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది. ఏం చేసుకుంటావో చేసుకోమని సుమిత్ర అనగానే.. అది నాతో వచ్చేవరకు ఇక్కడే ఉంటానని నరసింహా అంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళుకుంటే పోలీసిలని పిలుస్తానంటూ దశరత్ అంటాడు. నువ్వు వాడి బలం చూసుకొని ఇలా ఉంటున్నావ్ కదా అంటూ కోపంగా దీపతో నరసింహా అనేసి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దీప ఏడుస్తూ తన రూమ్ కి వెళ్తుంది. మరొకవైపు కార్తీక్ పేరెంట్స్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ ఎప్పుడు ఇంట్లో ఉండడం లేదు.. మనం ఇంకొక అమ్మాయిని కంటే బాగుండేది అనగానే కాంచన భర్త షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.