Karthika Deepam2 : స్వప్న ఇచ్చిన పెన్ డ్రైవ్ చూసి శ్రీధర్ షాక్.. కార్తీక్ నిజం చెప్తాడా!
on Jan 6, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -559 లో....సుమిత్ర గురించి కార్తీక్ ఆలోచిస్తుంటే అప్పుడే దీప వస్తుంది. ఏంటి బావ అలా ఉన్నావ్.. అమ్మ గురించి ఏదైనా దాస్తున్నావా అని అడుగుతుంది. అదేం లేదని కార్తీక్ అంటాడు. అప్పుడే శ్రీధర్ ఫోన్ చేసి జ్యోత్స్న ఫ్రాడ్ చేసిందని నిరూపించే ఫైల్స్ లేవు అలాగే సిస్టమ్ లో డాటా కూడా లేదని శ్రీధర్ చెప్తుంటే ఎందుకు నాన్న అంత నెగ్లెట్ గా ఉన్నావని శ్రీధర్ పై కార్తీక్ కోప్పడతాడు.
అప్పుడే కాంచన వచ్చి మళ్ళీ ఏమైందని అడుగుతుంది. నాన్న చిన్న తప్పు చేసాడని చెప్తాడు. మళ్ళీ ఆయన ఎందుకు ఆఫీస్ కి వెళ్ళడని కాంచన అడుగుతుంది. తాతనే చెప్పాడని కార్తీక్ అంటాడు. మరుసటి రోజు స్వప్న కబోర్డు లో ఉన్న కాశీ షర్ట్స్ చూసి బాధపడుతుంది. షర్ట్స్ అన్ని తీస్తుంటే అందులో ఫైల్స్ పెన్‌డ్రైవ్ ఉంటుంది. అది చూసి నాన్నకి కాశీ ఇవ్వడం మర్చిపోయాడేమోనని శ్రీధర్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఏంటి అండి ఇంత త్వరగా రెడి అయ్యారని శ్రీధర్ తో కావేరి అంటుంది. స్టేషన్ కి వెళ్ళాలి కాశీ దగ్గరికి అనగానే అప్పుడే స్వప్న ఫైల్స్ తీసుకొని వచ్చి ఇస్తుంది. అది చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. అల్లుడు నన్ను మోసం చేసాడు. ఇదంతా చేసింది వైరా కాదు జ్యోత్స్న అని శ్రీధర్ అంటాడు. అవ్వన్నీ ఫైల్స్ తీసుకొని ఇవన్నీ ఎవరికి చూపించాలో నాకు తెలుసు అక్కడికే వెళ్తున్నానని శ్రీధర్ అక్కడ నుండి బయల్దేరతాడు. మరొకవైపు సుమిత్ర గురించి
కాంచన, దీపలకి చెప్పాలని కార్తీక్ అనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు.
ఏంటి బావ ఏదో చెప్పాలని అనుకుంటున్నావ్.. చెప్పకపోతే బిడ్డపై ఒట్టే అని దీప అనగానే.. అత్తకి చిన్న హెల్త్ ప్రాబ్లమ్ ఉందని చెప్తాడు. చిన్న ప్రాబ్లమ్ అయితే నువ్వు ఇలా ఉండవని దీప అంటుంది. మనకి టైమ్ అవుతుంది పదా అని దీపని తీసుకొని శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు కార్తీక్. వచ్చావా ఇదేంటో తెలుసా సుమిత్ర రిపోర్ట్స్ అని శివన్నారాయణ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. కార్ లో మర్చిపోయావ్. హాస్పిటల్ కి ఫోన్ చేసి డాక్టర్ తో మాట్లాడాను. అసలు విషయం చెప్పారనగానే కార్తీక్ టెన్షన్ పడుతాడు. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అనగానే కార్తీక్ ఇంకా టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



