ENGLISH | TELUGU  
Home  » TV News

అత్తారింటికి మొదటిసారి వెళ్తున్న రాజ్.. కొత్త జంటకి కనకం ఘనమైన ఏర్పాట్లు!

on Apr 9, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ లో.. అత్తారింటికి వెళ్ళడానికి రాజ్ డిసైడ్ అవుతాడు. మొదటిసారి కావ్య వాళ్ళింటికి రాజ్ వెళ్తుండటంతో 'బ్రహ్మముడి' ఆసక్తికరంగా సాగుతుంది. శనివారం నాటి ఎపిసోడ్‌-65 లో.. కావ్యని వాళ్ళ పుట్టింటికి తీసుకుపోవడం రాజ్ కి కొంచెం కూడా ఇష్టం ఉండదు. అయినా రాజ్ వాళ్ళ నానమ్మ మీరు వెళ్ళండని రాజ్ కావ్యలకి చెప్తుంది. ఇక ఇద్దరు బయల్దేరి వెళ్తారు. ఆ తర్వాత రాజ్, కావ్య‌లు ఇద్దరు వస్తున్న విషయాన్ని కనకంకి కళ్యాణ్ ఫోన్ చేసి చెప్తాడు. దాంతో కనకం సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. ఇల్లంతా సందడి చేస్తూ.. కృష్ణమూర్తికి కావ్య, రాజ్ లు వస్తున్నట్లు చెప్తుంది. దాంతో కృష్ణమూర్తి కల గన్నవా అని కనకంని అడుగుతాడు. లేదు నాన్న నిజంగానే అక్క బావ వస్తున్నారంట అని అప్పు అనగానే.. కృష్ణమూర్తి చాలా సంతోషిస్తాడు.

రాజ్, కావ్య లు బయల్దేరి వస్తుండగా.. పూలు అమ్మే ఆవిడ వచ్చి పూలు కొనమని అడుగుతుంది. పూలు కొనేవరకు అక్కడ నుండి వెళ్ళదు. దాంతో రాజ్ పూలు కొని కార్ లో ఉన్న వినాయకుడి దగ్గర పెడతాడు. కాసేపటికే అటుగా వీస్తున్న గాలికి ఆ పూలు కాస్త కావ్య చేతిలో పడతాయి. కావ్య దేవుడిచ్చాడని సంతోషపడి పూలు పెట్టుకుంటుంది. కార్ లో వెళ్తున్నంతసేపు రాజ్, కావ్యలు వాదించుకుంటూనే ఉంటారు. కాసేపటికి మీ అమ్మ వద్దు అని చెప్పినా కూడా నన్ను ఎందుకు మా ఇంటికి తీసుకువెళ్తున్నారని కావ్య అడుగుతుంది. నేను స్వప్న గురించి తెలుసుకోవడానికి అని మనసులో అనుకుంటాడు రాజ్. కాని కావ్యకి మాత్రం సమాధానం చెప్పడు. మరోవైపు స్వప్న గుడి దగ్గర కూర్చొని ఉండగా.. గుడి దగ్గర ఊడ్చేవాళ్ళు స్వప్నని చూస్తారు. ఇలాంటివాళ్ళే ఏదో తప్పు పని చేసి అమ్మనాన్నలను బాధ పెడుతారంటూ స్వప్నని ఉద్దేశించి మాట్లాడుకుంటారు. ఇక ఆ మాటలు విన్న స్వప్న.. రాహుల్ కి ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంటుంది‌. ఒకవేళ రాహుల్ ఫ్రీగా ఉంటే నాకు చేస్తాడు కదా నేను డిస్టర్బ్ చేయడమెందుకని స్వప్న అనుకుంటుంది.

మరోవైపు రాజ్, కావ్యలు వస్తున్నారని.. వాళ్ళ ఇంట్లో స్వప్నకి సంబంధించినవేమీ ఉండకుండా జాగ్రత్త పడుతుంది కనకం. "అప్పు.. మన పరువు తీసిన దాని వస్తువులు ఈ ఇంట్లో వద్దు.. తీసుకెళ్ళు" అని చెప్పి ఇల్లంతా సర్దుతుంది కనకం. ఇంతలో కృష్ణమూర్తి-కనకం వాళ్ళ ఇంటికి రాజ్ కావ్యలు ఇద్దరు వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.