Karthika Deepam2: తన మాటలతో కాశీని మార్చేసిన జ్యోత్స్న.. శ్రీధర్ కి ముప్పు!
on Dec 18, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -543 లో.. జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటుంటే అప్పుడే దీప వస్తుంది. నా కడుపులో బిడ్డకి ఏమైనా అయితే ఏం చేస్తానో తెలుసు కదా అని దీప వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత దీప వెళ్ళాక దీని సంగతి చెప్పాలని జ్యోత్స్న అనుకుటుంది. గ్రానీ నేను రమ్మంటున్నానని కాశీని తీసుకొని రా అని జ్యోత్స్న అనగానే కాశీ దగ్గరికి పారిజాతం వెళ్తుంది. ఒరేయ్ మీ అక్క రమ్మంటుందని తీసుకొని వెళ్తుంది.
కాశీ వెళ్ళగానే నువ్వు ఇంత చదువు పెట్టుకొని పీఏగా చెయ్యడమేంటి.. మీ మావయ్య నిన్ను డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఒకసారి నీ రెజ్యుమె పంపు అని జ్యోత్స్న అనగానే కాశీ పంపిస్తాడు అది చూసి ఇంత మెరిట్ స్టూడెంట్ ఇలా పని చెయ్యడమేంటి.. మీ మావయ్య నిన్ను తక్కువ పోస్ట్ లో ఉంచాడు.. దానికి నీ భార్య సపోర్ట్ కూడా ఉందని కాశీ మనసులో శ్రీధర్ గురించి నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేలా జ్యోత్స్న మాట్లాడుతుంది. మీ మావయ్య నిన్ను పర్మినెంట్ డ్రైవర్ చేసేలా ఉన్నాడని జ్యోత్స్న అంటుంది. నేను మంచి జాబ్ ఇప్పిస్తాను చేస్తావా అని జ్యోత్స్న అనగానే శ్రీధర్, స్వప్న అవమానం గా మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని చేస్తానని కాశీ అంటాడు. ప్లాన్ సక్సెస్ అని జ్యోత్స్న అనుకుటుంది. మరొకవైపు సుమిత్రకి దశరథ్ జ్యూస్ తీసుకొని వస్తాడు. తాగమని రిక్వెస్ట్ చెస్తాడు. వాళ్ళ ప్రేమని చూసి దీప మురిసిపోతుంది.
ఆ తర్వాత కాశీ కార్ దగ్గర ఉండగా అప్పుడే శ్రీధర్, కార్తీక్ వస్తాడు. పైనుండి జ్యోత్స్న, పారిజాతం చూస్తారు వాళ్ళకి శ్రీధర్ హాయ్ చెప్తాడు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం అవసరమా అని కార్తీక్ అనగానే నిజాలు బయట పడుతాయని తెలియదు కదా అని శ్రీధర్ అంటాడు. నిజాలు బయటకు రానివ్వనని జ్యోత్స్న అనుకుంటుంది. కాశీ కార్ తియ్ అనగానే కాశీ, జ్యోత్స్న అన్నమాటలు గుర్తుచేసుకుంటాడు. దాంతో కాశీ వంక జ్యోత్స్న జాలిగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



