Karthika Deepam2 : సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్.. నిజం తెలిసి షాకైన శివన్నారాయణ!
on Jan 7, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -560 లో.. కార్తీక్, దీప ఇంటికి వస్తారు. వాళ్ళు రాగానే సుమిత్ర రిపోర్ట్స్ శివన్నారాయణ ఎదురుగా పెట్టి రిపోర్ట్స్ కార్ లో ఉన్నాయి.. కావాలనే అక్కడ పెట్టావ్ కదా. రిపోర్ట్స్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేశా.. డాక్టర్ హారిక అంట.. మీకు కార్తీక్ ఏం చెప్పలేదా తనని అడగండి అంటుంది. అసలు ఏమైంది ఎవరికి ప్రాబ్లమ్ అని కార్తీక్ ని శివన్నారాయణ నిలదీస్తాడు. మరొకవైపు జ్యోత్స్న చేసిన మోసాన్ని బయటపెట్టాలని శివన్నారాయణ దగ్గరికి శ్రీధర్ వస్తాడు.
ఆ తర్వాత కార్తీక్ మా దగ్గర ఏదో దాస్తున్నావని శివన్నారాయణ కోప్పడతాడు. అప్పుడే సుమిత్ర వస్తుంది. ఆ రిపోర్ట్స్ లో ఏముంది మా అయనకి ఏమైందని సుమిత్ర అడుగుతుంది. ఎవరు ఎంత అడిగినా చెప్పకపోయేసరికి శివన్నారాయణకి కోపం వచ్చి కార్తీక్ ని కొడుతాడు. అప్పుడే శ్రీధర్ వస్తాడు. అసలు ఏమైందంటు సుమిత్ర దగ్గుతూ కిందపడిపోతుంది. వెంటనే డాక్టర్ ని పిలుస్తాడు. లోపల సుమిత్రకి డాక్టర్ ట్రీట్ మెంట్ ఇస్తుంటే బయట ఇప్పుడు అయిన నిజం చెప్పారా అని కార్తీక్ కాలర్ పట్టుకుంటాడు దశరథ్. అప్పుడే డాక్టర్ వచ్చి కార్తీక్ నిజం చెప్పడు.. అతని కాలర్ వదలమని చెప్తుంది. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్ మెంట్ చేస్తే తగ్గే స్టేజిలోనే ఉందని డాక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు.
ఇంకొక విషయం ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్సప్లాంటేషన్ చెయ్యాలి.. అలా చేస్తే సుమిత్ర గారు బతుకుతారు.
సుమిత్ర గారి కూతురు ఎవరైనా ఉన్నారా అని డాక్టర్ అడుగుతుంది. దీపని చూసి ఇమేని చూడగానే సుమిత్ర కూతురు అనుకున్నానని డాక్టర్ అనగానే తన పక్కనున్న జ్యోత్స్న, సుమిత్ర కూతురు అని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్ననే సుమిత్రని బ్రతికిస్తుందని డాక్టర్ చెప్తుంది. సర్జరీ చెయ్యాలంటే
సుమిత్ర గారి కూతురిది అయితేనే మ్యాచ్ అవుతుందని డాక్టర్ చెప్పగానే నేను కూతురిని కాదు కదా అని జ్యోత్స్న భయపడుతుంది. ఇక నిజం తెలిసిపోతుందని పారిజాతం భయపడుతుంది. ఆ తర్వాత సుమిత్రకి నిజం చెప్పే దైర్యం చెప్పండి అని డాక్టర్ వెళ్ళిపోతుంది. కార్తీక్ కి శివన్నారాయణ, దశరథ్ సారీ చెప్తారు. శ్రీధర్ ఫైల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



