వెంకీ మామ పాటలు వింటూ తెలుగు నేర్చుకుంటున్నా...
on May 5, 2025
గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం అలియాస్ జ్యోతి పూర్వజ్ ప్రస్తుతం తెలుగు మాట్లాడ్డం నేర్చుకుంటోంది. దానికి సంబందించిన ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. జ్యోతి కిల్లర్ మూవీ చేస్తోంది. అది త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఐతే ఇప్పుడు జ్యోతి తెలుగు నేర్చుకునే పనిలో పడింది. ఎందుకంటే తెలుగులో తన ఓన్ డబ్బింగ్ తానే చెప్పుకోవాలంటే తెలుగు అవసరం. మూవీ ప్రమోషన్స్ లో కూడా తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ కావాలి అంటే తెలుగులో మాట్లాడాలి. ఇప్పుడు జ్యోతి అదే పనిలో పడింది.
అందులో భాగంగా వెంకటేష్ నటించిన "నువ్వు నాకు నచ్చావ్" మూవీలోని "ఓ నవ్వు చాలు అనే సాంగ్ ని వింటూ అదే లిరిక్స్ కి తగ్గట్టు తెలుగులో పాట కూడా పాడేస్తూ ఒక రీల్ ని పోస్ట్ చేసింది. అలాగే "నేను తెలుగు మాట్లాడగలను...కానీ తెలుగులో సరిగ్గా చదవలేను. కానీ నేను తెలుగు మాట్లాడడానికి, చదవడానికి ప్రతీ రోజూ ప్రయత్నిస్తున్నాను... చూద్దాం..అందుకే నేను తెలుగు పాటల లిరిక్స్ ని అలాగే ప్రాక్టీస్ చేస్తూ తెలుగును నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. " అంటూ చెప్పింది. ఇక జ్యోతి తెలుగు నేర్చుకోవడం చూసిన నెటిజన్స్ మెసేజెస్ చేస్తున్నారు. "సూపర్బ్ మీరు వెంకటేష్ గారితో హీరోయిన్ గా చేయాలి ఆల్ ది బెస్ట్...బాగా పాడుతున్నారు..మంచి గొంతు.. మరో గ్రేట్ సింగర్ రాబోతోంది. మీ భాష కాకపోయినా బాగా పాడుతున్నారు. ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి. వెంకీ మామ మీరు ఒక స్క్రీన్ లో బాగుంటుంది. తెలుగు ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ హీరోయిన్." అంటూ ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. జ్యోతి పూర్వజ్ గుప్పెడంత మనసు సీరియల్ తో రిషికి తల్లిగా జగతిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
