మళ్ళీ పెళ్లి చేసుకున్న జ్యోతక్క
on May 22, 2025
సోషల్ మీడియా బాగా పెరిగాక చిన్న విషయం కూడా బాగా వైరల్ ఐపోతోంది. బుల్లితెర మీద శివ జ్యోతి అలియాస్ జ్యోతక్క ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ కూడా. బిగ్ బాస్ లో ఎక్కువగా ప్రతీ విషయానికి జ్యోతక్క ఏడ్చేది. ఆ తర్వాత అన్ని షోస్ కి జ్యోతి రావడం మొదలు పెట్టింది. అలాగే తన భర్తతో కలిసి రావడం స్టార్ట్ చేసింది. జ్యోతక్కతో పాటు ఆమె భర్త గంగూలీ కూడా ఫుల్ ఫేమస్ అయ్యాడు. రీసెంట్ గా వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు.
2015 లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి వీడియోని చూసాక నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. కిర్రాక్ సీత, విష్ణు ప్రియా వంటి వాళ్లంతా విషెస్ చెప్తున్నారు. ఇంకొంతమంది ఐతే "ఒక్కసారి పెళ్లి చేసుకున్నందుకు చాలా జంటలు బాధపడుతున్నాయి. కానీ మీరు చాల గ్రేట్..ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండండి. హమ్మయ ఈసారి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సూపర్, ఇంకా బాబో, పాపో వస్తే ఇంకా బాగుంటది. అక్క టెన్ ఇయర్స్ కి మళ్ళీ పెళ్లి ప్లానింగ్ బాగుంది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ" అంటూ మెసేజెస్ పెడుతున్నారు. శివజ్యోతి న్యూస్ రీడర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. అప్పట్లో గంగులుని నిజామాబాద్ లోని సాయి బాబా ఆలయంలో పెళ్లి చేసుకుంది. తన యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ విషయం మీద ఒక వీడియో చేసింది. ఐతే ఈమె పై రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ మీద కొన్ని ట్రోల్ల్స్ కూడా వచ్చాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
