ENGLISH | TELUGU  
Home  » TV News

Jayam serial : భానుని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన శకుంతల.. గంగ ఏం చేయనుంది!

on Feb 11, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'( Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -189 లో..... రుద్ర, గంగ ఇద్దరు శివలింగానికి పూజ చేస్తారు. రుద్ర హారతి ఇస్తాడు. అదేంటి హారతి ఇస్తుంటే శివలింగం అలా అయిందని ఆశ్చర్యంగా చూస్తాడు. అదే విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తాడు ఇది ఒరిజినల్ శివలింగం కాదని రుద్ర అనగానే అందరు షాక్ అవుతారు. అంటే శివుడి దయ మనపై లేనట్లేనా అని శకుంతల అంటుంది. అప్పుడే పాము వచ్చి పంతులు బ్యాగ్ లోకి వెళ్తుంది.

ఆ బ్యాగ్ తో సహా బయట పారేస్తానని పంతులు బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే గంగ ఆపి బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒరిజినల్ శివలింగం ఉంటుంది. దాని చుట్టూ పాము ఉంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు. పాము వెళ్ళిపోతుంది. పంతులు పారిపోతాడు. పంతులు సంగతి నేను చూసుకుంటానని వీరు వెళ్తాడు. అమృత గడియలు పోతాయ్.. ముందు పూజ చెయ్యమని శకుంతల అనగానే రుద్ర, గంగ పూజ చేస్తారు. ఆ తర్వాత వీరు వచ్చి పంతులు తప్పించుకున్నాడని చెప్తాడు. అసలు ఎవరు ఆ పంతులు అని అందరు అనుకుంటారు. మన ఇంట్లో శివలింగం ఉందని అతనికి ఎలా తెలుసని గంగ అంటుంది అవును ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తే తెలుస్తుందని పెద్దసారు అంటాడు.

ఆ తర్వాత ఇంట్లో అందరు డల్ గా ఉంటారు. అప్పడే గంగ వచ్చి ఏమైందని అడుగుతుంది. ఈ రోజు మా భాను అన్నయ్య బర్త్ డే అని వంశీ చెప్తాడు. భాను జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు రుద్ర. ఇక భాను ఫోటో పట్టుకొని శకుంతల ఏడుస్తుంది. మరొకవైపు ప్రమీల ఎమోషనల్ అవుతుంది. శకుంతల దగ్గరికి వీరు వచ్చి మీరు నన్ను సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. భాను బర్త్ డే సందర్భంగా గుడిలో అన్నదానం చేయిస్తున్నానని వీరు అనగానే నువ్వు మాత్రమే భాను గురించి పట్టించుకుంటున్నావని శకుంతల అంటుంది. శకుంతల హాల్లోకి వస్తుంది. అప్పుడే భాను ఫోటోని గంగ హాల్లో పెట్టడం చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.