Jayam serial : గంగకి అండగా రుద్ర.. పారు ప్లాన్ నెరవేరేనా!
on Jan 7, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -161 లో......మిసెస్ గంగ రుద్ర ప్రతాప్ అని మైక్ లో పిలవగానే రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గంగ అకాడమీ లోనే స్టే చెయ్యాలని అక్కడ ట్రైనర్ చెప్తాడు. గంగని అకాడమీ నుండి పంపించాలని పారుతో పాటు అక్కడున్నా మేనేజ్మెంట్ అనుకుంటారు. గంగ చేత ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తారు. ఎక్కవ వెయిట్ లిఫ్ట్ చేపిస్తారు. వెయిట్ లిఫ్ట్ మెషిన్ కి ఉన్న స్క్రూలు లూజ్ చెయ్యాలని ఒకతన్ని పిలిపిస్తారు.
గంగపై అది పడేలా ప్లాన్ చేస్తారు. మరొకవైపు రుద్ర టీ షాప్ లో ఉంటాడు. అక్కడికి అకాడమీలో స్క్రూలు లూజ్ చేసిన అతను వస్తాడు. అకాడమీ గురించి మాట్లాడుతూ.. ఆ ట్రైనర్ మరి శాడిస్ట్ లా ఉన్నాడు. పాపం ఒక ఆవిడ ఆస్తమా అంటున్నా కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్ చేపిస్తున్నాడు అంతే కాకుండా వెయిట్ లిఫ్ట్ చేసే మెషిన్ స్క్రూలు కూడా లూజ్ చెయ్యమన్నాడని అతను చెప్పగానే రుద్ర పరుగున గంగ దగ్గరికి వెళ్తాడు. వెయిట్ మెషిన్ గంగ మీద పడకుండా ఆపుతాడు రుద్ర. అక్కడ వాళ్లపై రుద్ర గొడవకి దిగుతాడు. గంగ సర్దిచెప్పి రుద్రని బయటకు పంపిస్తుంది.
మరొకవైపు గంగ రుద్ర ఇంటికి రాలేదని ఇంట్లో అందరు వెయిట్ చేస్తారు. రుద్ర ఒక్కడే వస్తాడు. గంగ ట్రైనింగ్ అయ్యేవరకు అక్కడే ఉంటుందని శకుంతలకి తెలిసి కోప్పడుతుంది. గంగ అక్కడ ఉంటే కోడలిగా అవసరం లేదని తన నిర్ణయాన్ని చెప్తుంది శకుంతల. తరువాయి భాగంలో గంగను అకాడమీ నుండి పంపించడానికి పారు ప్లాన్ చేస్తుంది. గంగ తాగిన జ్యూస్ లో ఏదో కలుపుతుంది. అది తాగి గంగ మత్తులో డ్యాన్స్ చేస్తుంది. అది వీడియో తీసి అక్కడ ఒకతనికి పంపిస్తుంది పారు. వెంటనే మేడమ్ ని తీసుకొని గంగ దగ్గరికిరా గంగని ఈ సిచువేషన్ లో చూసిందంటే అకాడమీ నుండి పంపిస్తుందని అతనికి పారు చెప్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



