Jayam serial: గంగని తీసుకురమ్మని చెప్పిన పెద్దసారు.. రుద్ర ఏం చేయబోతున్నాడు?
on Dec 16, 2025

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -143 లో... నన్ను ఇంత మోసం చేసావ్.. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని గంగతో రుద్ర అంటాడు. గంగ వెళ్ళబోతుంటే తనపై ఏదో పడిపోతుంటుంది అది చూసి రుద్ర ఆపుతాడు. నాకు మీకు సంబంధం లేదని అన్నావ్ కదా ఏమైతే ఏంటని గంగ అంటుంది. గంగ కార్ వచ్చింది వెళ్ళమని రుద్ర అనగానే నేను వెళ్తానని గంగ అంటుంది. ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లే సంస్కారం కాదని గంగని తన వెంట తీసుకొని వెళ్లి వాళ్ళ ఇంటి ముందు దింపి వస్తాడు.
ఆ తర్వాత రుద్ర ఇంటికి వస్తాడు. ఒంటరిగా రావడం చూసి అంటే నువ్వు ప్రీతీతో చెప్పింది నిజమేనా.. అసలు గంగ ఏం తప్పు చేసింది అని వదిలేసి వచ్చావని పెద్దసారు అడుగుతాడు. తప్పు చేసింది సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేసింది తనే.. తన ఇంట్లో ట్రైపాడ్ దొరికిందని రుద్ర అంటాడు. అదంతా నిజం అయి ఉండదు ఎందుకంటే గంగకి అంత నాలెడ్జ్ లేదని వంశీ, సూర్య అంటే వాళ్ళపై రుద్ర అరుస్తాడు. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు.. ఇక ఈ విషయం గురించి డిస్కషన్ వద్దని రుద్ర అంటాడు.
పెద్దసారు నచ్చజెప్పబోతుంటే ఫోర్స్ చెయ్యకండి పెద్దనాన్న అని రుద్ర అంటాడు. అంతా చేసింది నువ్వు.. తెలియకుండా పెళ్లి చేసుకొని వచ్చి తనకి దగ్గర అయింది నువ్వు.. ఇప్పుడు ఆయన్ని ఫోర్స్ చెయ్యకు అంటావేంటని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత రుద్ర పైకి వెళ్తాడు. మరొకవైపు నా గురించి టెన్షన్ పడకు అమ్మ అని లక్ష్మీకి గంగ దైర్యం చెప్తుంది.
ఆ తర్వాత గంగని వెళ్లి తీసుకొని వస్తానని పెద్దసారు అంటాడు. వద్దని చెప్తున్నాను కదా ఇక వెళ్లిన దరిద్రం మళ్ళీ తీసుకొని రావద్దని శకుంతల అంటుంది. ఇక ఇషిక, పారు కలిసి టాపిక్ డైవర్ట్ చేస్తారు.
తరువాయి భాగంలో గంగ దగ్గరికి పెద్దసారు వెళ్లి రమ్మని అడుగుతాడు. రానని గంగ చెప్తుంది. ఆ తర్వాత పెద్దసారు ఇంటికి వెళ్లి రుద్రతో గంగని తీసుకొని రమ్మని చెప్తాడు. గంగ వస్తే నేను వెళ్ళిపోతానని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



