తెలియక బెట్టింగ్ యాప్స్ ప్రోమోట్ చేశా
on Apr 30, 2025
జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఈవెంట్స్, షోస్ , సీరియల్స్ లో నటించింది రీతూ. ఇక ఈమె చుట్టూ గత ఏడాది నుంచి 700 కోట్ల స్కాం అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ వంటి వివాదాలలో ఆమె ఇరుక్కుపోయిన విషయం అందరికీ తెలుసు. ఇక ఆమె తన సీక్రెట్ పెళ్లి గురించి చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. "మేము ఒక ప్రోపర్ రిలేషన్ షిప్ లో ఒక ఏడాది పాటు ఉన్నాము. ప్రస్తుతం ఉన్న జనరేషన్ వల్లనో నా మెంటాలిటీ వల్లనో, అతని మెంటాలిటీ వల్లనో ఇద్దరికీ సెట్ కాలేదు.
మహా అంటే కలిసి ఆరు నెలలు ఉండుంటాం..నేను దాన్ని పెళ్లి అని ఐతే అనను. ఎందుకంటే అది పెళ్లి కాదు కాబట్టి. సోషల్ మీడియాలో ఫొటోస్ ఎవరు రిలీజ్ చేశారో తెలీదు. ఆ ఫొటోస్ నా దగ్గర కూడా లేవు. ఆ ఫొటోస్ కి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. బ్రేకప్ ఎందుకు జరిగింది అన్న విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి బ్రేకప్ జరుగుతోంది. నాగ చైతన్యకు సమంతకు ఎందుకు బ్రేకప్ అయ్యిందో తెలుసా...విడిపోవడానికి ఎవరి దగ్గర పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ ఉండదు. అదంతా పర్సనల్. ఇప్పుడు ఇది చెప్పడం వలన అతని పర్సనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నేను చెప్పను. ఇద్దరం కలిసే బ్రేకప్ అయ్యాము. రిలేషన్ షిప్ కి ఒక దణ్ణం, మగజాతికి ఒక దణ్ణం. పెళ్లి ఒక ట్రామా. పెళ్లి అంటేనే పారిపోవాలని అనిపిస్తోంది. పెళ్లి చేసుకొని ఇలాగే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు నచ్చినవాడు దొరకలేదు. మా అమ్మకు మా నాన్న లాంటి వాడు దొరికాడు. ఆయన లాంటి వాళ్ళు దొరికితే నేను హ్యాపీ. పెళ్లి అంటే మెంటల్ టార్చర్, చిరాకు, అదొక టాక్సిక్ , అదొక డిప్రెషన్ అన్నీ. ఇక బెట్టింగ్ యాప్స్ మీద కూడా నా పేరు బాగా బయటకు వచ్చింది. తెలీనప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసాను. కానీ అది తప్పు అని తెలిసాక చేయలేదు.." అని చెప్పిన రీతూ చౌదరి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
