నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ...
on Jun 18, 2025
జబర్దస్త్ షో న్యూ ప్రోమో ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. న్యూ చాప్టర్ బిగిన్స్ అని ఏదైతే చెప్పారో అది ఈ ఎపిసోడ్ లో కనిపించబోతోంది అన్న విషయం తెలుస్తోంది. ఇంత మార్పులు ఈ షోలో వస్తున్నా కూడా సుధీర్ ఎపిసోడ్ కి మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇక జడ్జ్ ఖుషూ వచ్చి అన్నీ డబుల్ గా ఉండబోతున్నాయా అంది. అవును యాంకర్ కూడా డబుల్ కాబోతున్నారు అని చెప్పింది. ఇక రష్మీ పక్కన బ్రహ్మముడి హీరో మానస్ సెకండ్ యాంకర్ గా వచ్చేసాడు. ఐతే రావడమే ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ఎలా ఐతే కళ్ళజోడు తీసి పెట్టి తనదైన మ్యానరిజమ్ ని చేసేవాడో మానస్ కూడా అలాగే చేసాడు. ఇక రష్మీ ఐతే ఉడుక్కుంది. "తెల్ల తోలు కదా స్టైలిష్ గా ఉంటది హలో మాస్ ఇక్కడ మాస్ పిల్ల" అంది.."నువ్వు మాస్ ఐతే నేను మానస్ ఊరమాస్ ఇక్కడ" అని కౌంటర్ డైలాగ్ వేసాడు. ఇప్పటి వరకు టీం లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది కానీ ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ ఉండబోతోంది అని చెప్పింది ఖుష్భూ. జబర్దస్త్ అమ్మాయి వెర్సెస్ ఖతర్నాక్ అబ్బాయి పేరుతో వీళ్ళ మధ్య పోటీ జరగబోతోంది.
ఇక స్కిట్స్ మీద ఆడియన్స్ స్పందనలు కూడా ఈ షోలో ఉండబోతున్నాయి ఇక. "చూసావా రష్మీ ఇప్పటి నుంచి మానస్ గాడి హవా స్టార్టవబోతోంది అంటూ కళ్ళజోడు తీసి పెట్టుకోబోతుండగా "వద్దు మానస్ ఈ స్పెక్ట్స్ ఇవన్నీ వద్దు. ఇవే పెట్టి పెట్టి" అంటూ రష్మీ ఒకప్పటి సుధీర్ ని గుర్తు చేసుకుంది. ఎప్పటిలాగే రాకింగ్ రాకేష్ పిల్లల్తో స్కిట్ చేయడానికి వచ్చాడు అతనితో ప్రవీణ్ ని కూడా తెచ్చుకున్నాడు. "ఈ స్టేజి మీద కొన్ని రోజులు నేను లేను కదా రష్మీ నా గురించి చాల ఫీలయ్యి ఉంటుంది కదా" అని అన్నాడు రాకేష్. "బిర్యానీలో ఆకు లాంటి ఆయన పోయినప్పుడే బాధపడలేదు. కూరలో కరివేపాకు లాంటోడివి నువ్వు పొతే బాధపడుతుందా" అంటూ ప్రవీణ్ కౌంటర్ వేసాడు. నూకరాజు స్కిట్ లో ఐతే బుల్లితెర సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
