Jayam serial : లక్ష్మీ వాళ్ళ బ్యాగ్ లో డబ్బు పెట్టిన ఇషిక.. రుద్ర ఏం చేయనున్నాడు!
on Jan 17, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -170 లో...... రుద్రని చూడటానికి గంగ పేరెంట్స్ వస్తారు. వాళ్ళకి ఓ గది ఇస్తారు. పైడి రాజు, లక్ష్మీ ఆ గదిలోకి వెళ్తారు. అప్పుడే రుద్ర వచ్చి.. మీరేంటి కిందపడుకున్నారని రుద్ర అడుగుతాడు. మాకు కిందే అలవాటు బాబు అని లక్ష్మీ అంటుంది. ఆ తర్వాత గంగ వచ్చి లక్ష్మీతో మాట్లాడుతుంది. గంగ నువ్వు అల్లుడుగారు సఖ్యతగా ఉన్నారా అని లక్ష్మీ అడుగగా బాగానే ఉన్నామని గంగ చెప్తుంది.
అమ్మకి నాపై డౌట్ వచ్చినట్లు ఉందనుకొని కావాలని లక్ష్మీకి వినపడేలా రుద్రతో గంగ ప్రేమగా మాట్లాడుతుంది. అది లక్ష్మీ విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు ఏంటి ఈ రోజు తేడాగా మాట్లాడుతున్నావని గంగతో రుద్ర అంటాడు. అ తర్వాత అందరు నిద్ర లేచే టైమ్ కి.. ఇషిక లేచి గంగ గది దగ్గరికి వెళ్తుంది. గంగ అప్పుడే నిద్ర లేచి గది బయటకు వెళ్తుంది. ఇషిక గంగ గదిలోకి వచ్చి గంగకి శకుంతల ఇచ్చిన డబ్బు తీసుకొని వెళ్లి లక్ష్మీ వాళ్ల బ్యాగ్ లో పెడుతుంది. అ తర్వాత గంగ ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. అందరు బాగుందని గంగని పొగుడుతారు.
అప్పుడే పారు వస్తుంది. అక్కడున్న పేడ తొక్కుతుంది. ఛీ అంటూ చిరాకు పడుతుంది పారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారు.. పేడ చల్లడం ఏంటని పారు అంటుంటే గంగ తనకి పండగ యొక్క గొప్పతనం గురించి చెప్తుంది. అప్పుడే శకుంతల వచ్చి ఇప్పటితరం వాళ్ళకి అలాంటివి ఎలా తెలుస్తాయని శకుంతల అంటుంది. పెద్దవాళ్ళు చెప్పాలని పెద్దసారు అంటాడు. తరువాయి భాగంలో డబ్బు కనిపించడం లేదని ఇంట్లో వాళ్ళకి గంగ చెప్తుంది. దాంతో మీ వాళ్ల బ్యాగ్ చెక్ చేయాల్సిందేనని ఇషిక అనగానే అప్పుడే రుద్ర ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



