కొత్త కారు కొన్న ఇనయా.. మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసినట్టేనా!
on Apr 4, 2023

ఇనయ ముజిబుర్ సుల్తానా.. బిగ్ బాస్ సీజన్-6 ముందు వరకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్ సీజన్-6 తో ఫుల్ ఫేమస్ అయింది. రామ్ గోపాల్ వర్మతో చిందులు వేసిన వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకొని, బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. లేడీ టైగర్ అంటూ బిగ్ బాస్ హౌస్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు. హౌస్ లో ఎక్కువగా గొడవలకు ఇంపార్టెన్స్ ఇస్తూ అందరి చూపు తన వైపు తిప్పుకుంది ఇనయా. హౌస్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఎక్కువ ప్రేక్షకులను సంపాదించుకుంది.
ఇనయ సుల్తానా బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకొని.. వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉంటూ వస్తోంది. హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుని తన వైపుకి తిప్పుకుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని కాబోలు బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక చాలా మంది రిచ్ గా ఉండాలని ఇల్లు కొనడం, కార్ కొనడం చేస్తున్నారు. ఇదే కోవలో ఇప్పుడు ఇనయా సుల్తానా కూడా చేరింది. బిగ్ బాస్ వల్ల తన ఫ్యామిలీకి దగ్గర అయిన ఇనయా.. ఇప్పుడు కార్ కొని ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చింది.
కార్ తో దిగిన ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. My First car.. welcome to my Family అనే ట్యాగ్ తో చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ అంటూ విషెస్ చెప్తున్నారు. కాగా ఇప్పుడు కొత్త కారుతో ఇనయా దిగిన ఈ ఫోటోస్ ఇన్ స్టాగ్రామ్ లోని తన అభిమానులకి మంచి కిక్కు ఇచ్చాయనే చెప్పాలి. దీంతో ఇనయా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



