Illu illalu pillalu : నర్మద ప్లాన్ సూపర్.. ప్రేమ చేతుల మీదుగా బతుకమ్మ సాగిందిగా!
on Oct 10, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -285 లో.....నర్మద, ప్రేమ, శ్రీవల్లి ముగ్గురు కలిసి బతుకమ్మలని తీసుకొని వస్తారు. వాళ్ళు అలా సంతోషంగా ఉండడం చూసి పండుగ అంతా మన భార్యల మొహంలోనే కనిపిస్తుందని అన్నదముళ్లు అనుకుంటారు. అప్పుడే రామరాజు వచ్చి.. వాళ్ళు అలా పైకి ఉన్నా వాళ్ళ మనసులో బాధ ఉంటుంది కదా.. వాళ్ళ పుట్టింటికి దూరంగా ఉన్నారు. వాళ్లకి కష్టం రాకుండా చూసుకోవాలని తన కొడుకులకి రామరాజు చెప్తాడు.
మరొకవైపు ప్రేమ, నర్మద కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ప్రేమ పుట్టింటివాళ్ళు బతుకమ్మ తీసుకొని వస్తుంటే ప్రేమ, నర్మద వెళ్తారు. రేవతి పడిపోతుంటే తన చేతులో బతుకమ్మని ప్రేమ తీసుకుంటుంది. ఇలా చేతులు మారిన బతుకమ్మ మరొక చేతులకి మారితే అరిష్టమని నర్మద అంటుంది. అదేం లేదని భద్రవతి అంటుంది. అప్పుడే వేదవతి వచ్చి వాళ్ళు ముందు చేసుకున్న ప్లాన్ ప్రకారం మాట్లాడుతుంది.
వాళ్ళ బతుకమ్మ నువ్వెందుకు పట్టుకున్నావని వేదవతి అంటుంది. ఎంతైనా మన వాళ్ళు కదా.. అత్త చేతులు మారితే అరిష్టం అంట అని ప్రేమ అంటుంది. దాంతో వేదవతి కోపంగా వెళ్లినట్టు యాక్ట్ చేస్తుంది. ఆవిడ కోపంగా వెళ్ళింది.. ఈవిడ వద్దంటుంది త్వరగా వెళ్లి బతుకమ్మ అక్కడ పెట్టు ప్రేమ అని నర్మద అనగానే ప్రేమ వెళ్లి బతుకమ్మ పెడుతుంది. అనుకున్నట్లుగానే ప్రేమ చేతుల మీదుగా బతుకమ్మ తీసుకొని వస్తారు. అదంతా రామరాజుకి శ్రీవల్లి చూపిస్తుంది. ప్లాన్ సూపర్ అని నర్మదని వేదవతి మెచ్చుకుంటుంది. మరొకవైపు నర్మద పేరెంట్స్ ని సాగర్ తీసుకొని వచ్చి తనకి సర్ ప్రైజ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



