Illu illalu pillalu : నగలు తీసేసుకున్న శ్రీవల్లి.. తిరుపతి హ్యాపీ!
on Sep 4, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -254 లో.. ప్రేమకి కళ్యాణ్ ఫోన్ చెయ్యగానే తన సంగతి చెప్తానంటూ కళ్యాణ్ చెప్పిన అడ్రెస్ కి వెళ్తుంది కానీ ఎంత వెతికినా కళ్యాణ్ కనిపించడు. కళ్యణ్ ప్రేమకి ఫోన్ చేసి ఇంత టెన్షన్ పడుతూ కూడా ఎంత బాగున్నావ్ బేబీ అని తనని చాటు నుండి చూస్తూ ఫోన్ మాట్లాడతాడు. ఎక్కడున్నావ్ రా అని ప్రేమ కోపంగా మాట్లాడుతుంది. కళ్యాణ్ గురించి ప్రేమ వీధి వీధి వెతుక్కుంటూ అర్థరాత్రి రోడ్డుపై తిరుగుతు ధీరజ్ కి ఎదరుపడుతుంది. ఇంత అర్థరాత్రి ఏం చేస్తున్నావ్ ఏదో పెద్ద ప్రాబ్లమ్ నిన్ను భయపెడుతుంది.. ఏంటది అని ధీరజ్ అడుగగా ప్రేమ సైలెంట్ గా ఉంటుంది.
ప్రేమ చెప్పకపోవడంతో ప్రేమ చెంప చెల్లుమనిపిస్తాడు ధీరజ్. అది అటు గా వస్తున్న విశ్వ చూసి నా చెల్లినే కొడతావా అని ధీరజ్ తో గొడవ పడతాడు. దాంతో ప్రేమ విశ్వని కొడుతుంది. నా భర్త నన్ను కొడుతాడు.. తిడుతాడు నీకేంటి మధ్యలో అని ప్రేమ అనగానే విశ్వ బాధపడతాడు. విశ్వ ఇంటికి వచ్చి సేనాపతి, భద్రవతిలకి జరిగింది మొత్తం చెప్తాడు. ప్రేమ పూర్తిగా వాడి మాయలో పడిపోయిందని విశ్వ చెప్తాడు. ఎలాగైనా ఆ రామరాజు కుటుంబాన్ని నాశనం చెయ్యాలని భద్రవతి అనుకుంటుంది.
ఆ తర్వాత తిరుపతి పక్కన ఆనందరావు పడుకొని తన చెయ్ కి ఉన్న కలశాన్ని రంపంతో కోస్తాడు. అందులో గిల్టీ నగలని శ్రీవల్లికి ఇచ్చి ఏం తెలియనట్లు ఆనందరావు పడుకుంటాడు. మరుసటి రోజు తిరుపతి ఉదయం లేచేసరికి తన చెయ్ కి కలశం లేదని సంబరపడిపోతు ఇంట్లో అందరిని పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



