Illu illalu pillalu : అత్తాకోడల్లు కలిసిపోయారు.. శ్రీవల్లి ఏం చేయనుంది!
on Jul 31, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు:(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -224 లో.. నీకు ఈ పనులన్నీ ఎందుకు చెప్తుందో పెద్ద వదినని అడుగుతానని ధీరజ్ వెళ్తుంటాడు. నా గురించి అడగడానికి నువ్వెవరని ధీరజ్ తో ప్రేమ అంటుంది. వస్తువులు పని చేస్తే ఏంటీ.. ఏం చేస్తే ఏంటని ప్రేమ అంటుంది. ఒకసారి వస్తువు అన్నదాన్ని పట్టుకొని ఎందుకిలా సాధిస్తున్నావని ధీరజ్ ఫ్రస్ట్రేషన్ అవుతాడు.
మరొకవైపు నర్మద వెళ్తుంటే సాగర్ బండిపై వచ్చి ఎక్కమని చెప్తాడు. ఈ రోజు గుర్తు వచ్చానా అని నర్మద అంటుంటే.. నేనేం కావాలని రాలేదు నాన్న పంపించాడని సాగర్ అంటాడు. అంటే నువ్వు ప్రేమతో రాలేదు కదా.. నేను నీకు అవసరం లేనప్పుడు నువ్వు కూడా అవసరం లేదు.. నేను మా ఇంటికి వెళ్ళిపోతానని నర్మద ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత రాత్రి అందరు భోజనం చేస్తుంటారు. రామరాజు నర్మద, ప్రేమలని భోజనానికి పిలుస్తాడు. మావయ్యగారు వాళ్ళతో మాట్లాడుతున్నాడేంటని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తూ.. మావయ్య గారు చొక్కాని చింపారు ఆ విషయం గుర్తువచ్చి భోజనం చెయ్యాలి అనిపిస్తలేదని శ్రీవల్లి అంటుంటే రామరాజు తినే దగ్గర నుండి లేచి బయటకు వచ్చి బాధపడతాడు.
మీరు ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోబట్టే వాళ్ళు ఇలా బాధపడుతున్నారని ధీరజ్, సాగర్ లతో శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత సాగర్, ధీరజ్ పక్కకి వెళ్లి అంతా ప్రేమ వల్లే అని ధీరజ్ అంటుంటే నర్మద తప్పు కూడా ఉందని సాగర్ అంటాడు. ఎంతసేపు మీరు నాన్న తరపున ఆలోచిస్తారా.. నీపై ప్రేమతోనే ప్రేమ ఇలా చేసిందని ధీరజ్ తో చందు అంటాడు. తరువాయి భాగంలో వేదవతి, ప్రేమ, నర్మద నవ్వుతు మాట్లాడుకుంటుంటే.. వీళ్ళు ఎప్పుడు కలిసిపోయారని శ్రీవల్లి అనుకుంటుంది. మీరు కలిసిపోయారా అని శ్రీవల్లి అంటుంది. నేను వీళ్ళతో మాట్లాడడం ఏంటని వేదవతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



