Illu illalu pillalu : శ్రీవల్లికి జలక్ ఇచ్చిన ప్రేమ.. తన పెత్తనం కరెక్టేనన్న రామరాజు!
on Jul 29, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -222 లో......ధీరజ్ లేట్ గా వస్తాడని చెప్పినా కూడా వినకుండా శ్రీవల్లి డోర్ వేస్తుంది. ప్రేమ కూడా గుమ్మం దగ్గరే ఉంటుంది. ధీరజ్ రాగానే శ్రీవల్లి అక్క గడియ పెట్టిందని చెప్తుంది. ఇప్పుడేల ఆకలిగా ఉందని ధీరజ్ అంటాడు. దాంతో కాయిన్ తో కిటికీ ఓపెన్ చేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. మరుసటి రోజు ఉదయం శ్రీవల్లి డోర్ తీస్తుంది. పాపం వాళ్ళు రాత్రంతా బయటే ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతుంది.
వీళ్ళు ఎక్కడ అని చూస్తుంది. వాళ్ళు లోపలే ఉంటారు. మీరు లోపలికి ఎలా వచ్చారని ప్రేమని శ్రీవల్లి అడుగుతుంది. ఏమో మర్చిపోయా అని ప్రేమ సమాధానం చెప్తుంది. వీళ్ళు ఎలా వచ్చారని శ్రీవల్లి ఆలోచిస్తూ కిటికీ పట్టుకుంటుంది. అది ఉడిపోయి శ్రీవల్లి కిందపడుతుంది. వాళ్ళు వచ్చింది ఇలానా అని శ్రీవల్లి అందరిని పిలిచి జరిగింది చెప్తుంది. నేను లేట్ అయిందని డోర్ వేస్తే వాళ్ళు కిటికీ తీసుకొని మరీ లోపలికి వచ్చారని రామరాజుతో అంటుంది. నేనేం చేసిన వాళ్లకు అర్ధం అవడం లేదు.. నేను నీలా లేకనే ఇలా తయారయింది. నువ్వు బాగా చేస్తున్నావ్.. నీ ఇష్టం అని శ్రీవల్లితో రామరాజు అనగానే ఇక శ్రీవల్లి రెక్కలు వచ్చినట్లు రెచ్చిపోతుంది.
ప్రేమ వాళ్ళు అలా వచ్చినందుకు శ్రీవల్లి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. తరువాయి భాగం లో అందరు భోజనం చేస్తుంటే మిగతా వాళ్ళు ఎక్కడ అని రామరాజు అడుగుతాడు. ప్రేమ, నర్మదలని భోజనానికి పిలుస్తాడు రామరాజు. మావయ్య గారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఏంటని శ్రీవల్లి అనుకుంటుంది. వాళ్ళు కూడా భోజనం చేస్తుంటే మిమ్మల్ని అంత మంది చొక్కా చింపారు. అది గుర్తుకి వస్తే అన్నం తినాలనిపించడం లేదని శ్రీవల్లి కావాలనే గుర్తుచేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



