Illu illalu pillalu : పనులు మానుకొని పెళ్ళాంతో షికారు.. కొడుకుని తిట్టిన రామరాజు!
on May 9, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-153లో.. ఇంట్లో వాళ్లందరికీ రాత్రికి చపాతీలు చేస్తానని శ్రీవల్లి అంటుంది. అయ్య బాబోయ్ చపాతీలే.. ఇంట్లో పది మంది ఉన్నారు.. అందరికీ చపాతీలు చేయాలంటే యాభైకి పైనే చేయాలి.. ఏం వద్దులే అన్నం పెట్టేయ్ అని వేదవతి అంటుంది. అన్నం తింటే లావైపోతామ్ అత్తయ్య గారూ.. టిపినీలే మంచిది కాబట్టి చపాతీలు చేసేసి చికెన్ కర్రీ వండేత్తానండీ అని శ్రీవల్లి అంటుంది. పదా నేను సాయం చేస్తానని వేదవతి అనగా.. అయ్య బాబోయ్.. మీరు వంటగదిలోకి రావడం ఏంటండీ బాబూ.. అసలు మీరు ఎవరనుకుంటున్నారూ.. మీరు అత్తయ్య రూపంలో ఉన్న దేవత. నేను కోడలిగా వచ్చిన తరువాత కూడా మీరు ఇంటి పనులు చేయడం ఏంటండీ.. మీరు రెస్ట్ తీసుకోండి.. వంట అంతు నేను చూస్తానని శ్రీవల్లి అంటుంది. ఇక అప్పుడే నర్మద వస్తుంది. ఏంటమ్మ లేట్ అయిందని వేదవతి అనగా.. ఈవినింగ్ మా ఆఫీస్‌కి సాగర్ వచ్చాడు.. ఇద్దరం కలిసి బయటకు వెళ్లామని నర్మద అంటుంది. అయ్ బాబోయ్ అదేంటీ.. బయట కలుసుకోవడానికి.. బయట తిరగడానికి మీరిద్దరూ ఏమైనా లవర్సా ఏంటి? అని శ్రీవల్లి అంటుంది. హో లవర్స్ అయితేనే బయట కలుస్తారా.. భార్యాభర్తలు కలుసుకోకూడదా అని నర్మద తిరిగి అడుగుతుంది. అంటే.. నా ఉద్దేశం అది కాదు.. ఇంట్లో ఎలాగూ కలిసే ఉంటారు కదా.. బయటకలవడం ఏంటా అని అడుగుతున్నా అని శ్రీవల్లి గుచ్చి గుచ్చి అడుగుతుంది. అందుకే.. మేం ఇద్దరం రెస్టారెంట్‌కి వెళ్లాం బదులిస్తుంది నర్మద. ఓహో.. బాగా ఎంజాయ్ చేశారన్నమాట అని వేదవతి, ప్రేమ నవ్వుతుంటారు.
అత్తయ్యా మీకు సర్ ప్రైజ్ అంటూ అత్తకోసం తెచ్చిన మిరపకాయ బజ్జీల పొట్లం ఇస్తుంది నర్మద. ఆ వాసన చూసి వేదవతి.. ఆయ్... మిరపకాయ బజ్జీలూ అంటూ తెగ సంబరపడిపోతుంది. నాకు మిరపకాయ బజ్జీలు ఇష్టం అని గుర్తుపెట్టుకుని తెచ్చావ్.. ఈ అత్తయ్య మనసు తెలిసిన కోడలివే నువ్వూ అంటూ ప్రేమను దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది వేదవతి. ఇక ఆ బజ్జీలు తినద్దొంటు శ్రీవల్లి లాక్కుంటుంది. బయట ఫుడ్ బాగుండటం లేదు.. అత్తయ్య ఆరోగ్యం ముఖ్యం అంటూ నర్మదతో గొడవపెట్టుకొని మరీ ఆ మిర్చీలని తీసుకెళ్ళి పాడేస్తుంది.
మరోవైపు రామరాజు కోపంగా ఉంటాడు. అప్పుడే తిరుపతి వస్తాడు. కాసేపటికి అక్కడికి సాగర్ వస్తాడు. జగన్నాథం రైస్ మిల్లు దగ్గరికి కలెక్షన్ కు వెళ్ళాను నాన్న అని సాగర్ అబద్ధం చెప్తాడు. మరి డబ్బులు ఏవిరా అని రామారాజు అనగా.. ఆయన లేరు.. రేపిస్తా అన్నారని సాగర్ అంటాడు. ఉండు అతడికి కాల్ చేస్తా అని రామరాజు అనేసరికి ... నాన్న ఆగు అని సాగర్ అంటాడు. ఏంట్రా కంగారుపడుతున్నావ్ అని తిరుపతి అనగానే.. కంగారు పడక ఏం చేస్తాడూ.. సర్ గారూ నోరు తిరిస్తే అన్నీ అబద్దాలే కదా అని అంటాడు. ఏమైంది బావా? రేయ్ సాగర్.. ఎక్కడికి వెళ్లావ్ రా నువ్వు అని తిరుపతి అడుగుతాడు. చెప్పరా చెప్పు.. నిన్ను నేను రెస్టారెంట్‌లో చూడకపోయి ఉంటే.. ఇంకో అబద్ధం ఆడేవాడివి కదా అని రామరాజు అంటాడు. సరదాగా షికార్లు చేయడానికి నన్ను పర్మిషన్ అడిగాడు.. ఇవ్వకపోయేసరికి అబద్దం ఆడేసి.. పారిపోయాడు వీడు అని రెచ్చిపోతాడు రామరాజు. సారీ నాన్నా.. అని సాగర్ అనేసరికి.. నిన్ను నమ్మడం నాది తప్పు అని రామరాజు అంటాడు. పోనీలే బావా.. వాడికి కొత్తగా పెళ్లైంది కదా.. సరదాగా వెళ్లి ఉంటాడులే అని తిరుపతి అంటాడు. కొత్తగా పెళ్లైతే.. పనులు మానుకుని భార్యలతో షికారు చేయాలా? నేను పెళ్లైన తరువాత అలాగే చేశానా? నేను వీడిలాగే చేసి ఉంటే నా కుటుంబం ఇప్పుడు ఇలా ఉండేదా అని రామరాజు తిట్టేసి వెళ్ళిపోతాడు. ఇక సాగర్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



