Illu illalu pillalu : శ్రీవల్లి బంఢారం బయటపడుతుందా.. కామాక్షి నిజం చెప్తుందా!
on Aug 14, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -236 లో..... ప్రేమ, నర్మద చేసిన పనికి భాగ్యం ఆనందరావుని భయపెట్టి శ్రీవల్లి చేత బీరువా తాళాలు రామరాజుకి ఇచ్చేలా చేస్తారు. నా కూతురు చిన్నపిల్ల తనకి ఇప్పుడే ఇంటి పెత్తనం ఎందుకని భాగ్యం అంటుంది. అత్తయ్య గారు తాళాలు తీసుకోండి అని శ్రీవల్లి అంటుంది.
ఎందుకు అక్క మీరే ఉంచుకోండి మీరు అయితేనే ఇంటిని సమర్థవంతగా నడిపిస్తారని నర్మద అంటుంది. అదంతా ఏం కాదని తాళాలు రామరాజుకి ఇస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఆ తాళాలని వేదవతికి ఇస్తాడు రామరాజు. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి చందు వచ్చి.. నాకు డబ్బు కావాలి. మీ వాళ్ళని అడుగమని చందు అంటుంటే.. ఈ రోజు నా పుట్టినరోజు అది పట్టించుకోకుండా బాధపెడుతున్నారని శ్రీవల్లి యాక్టింగ్ చేస్తుంది. మరొకవైపు గోల్డ్ షాప్ కి శ్రీవల్లి ఇచ్చిన గోల్డ్ తీసుకొని వెళ్తుంది కామాక్షి. ఆ గోల్డ్ చూసి షాప్ అతను రోల్డ్ గోల్డ్ అని చెప్తాడు.
ఆ తర్వాత భాగ్యం దగ్గకి శ్రీవల్లి వచ్చి అయన డబ్బు అడుగుతున్నాడు. నాకు టెన్షన్ గా ఉందని చెప్తుంది. అప్పుడే కామాక్షి కోపంగా ఇంట్లోకి వచ్చి శ్రీవల్లిని పిలుస్తుంది. కామాక్షిని శ్రీవల్లి గదిలోకి తీసుకొని వెళ్తుంది. రోల్డ్ గోల్డ్ ఇచ్చి నన్ను మోసం చేస్తావా.. ఇప్పుడే ఈ విషయం నాన్న కి చెప్తానని బయటకు వస్తుంటే భాగ్యం ఆపుతుంది. అదంతా ప్రేమ, నర్మద చూస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



