Illu illalu pillalu: రామరాజు ఇంట్లోకి కొత్త కోడలు.. ఏడ్చేసిన ప్రేమ, నర్మద!
on Apr 20, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 137 లో.. ప్రేమ, నర్మద ఇద్దరు కలిసి కొత్త కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న శ్రీవల్లి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి కొత్త కోడలి కోసం హారతి పట్టుకొని ఎదురుచూస్తుంటారు. ఇక ఇద్దరు వారి గతాన్ని చూసుకొని.. ఇలాంటివి మనకేం దక్కలేదని అనుకుంటు ఎమోషనల్ అవుతారు. మొదట నర్మద తన చేతిలోని హారతి ప్రేమకి పడుతుంది. అలాగే నర్మదకి ప్రేమ హారతి పడుతుంది. అంటే వాళ్ళు ఇంట్లో పొందలేని ఇలాంటి ఓ అనుభవాన్ని రిక్రీయేట్ చేసుకొని ప్రేమ, నర్మద ఆనందపడతారు. ఇక అదంతా దూరం నుండి ధీరజ్ చూసి.. ఆడపిల్లలు పుట్టింటి నుంచి అందాల్సింది అందకపోతే వాళ్లు ఇంతలా బాధపడతారా అని ఎమోషనల్ అవుతాడు.
మరోవైపు శ్రీవల్లి, చందు కారులో వస్తుంటారు. శ్రీవల్లి ఏడుస్తుంటే ఇంటికి నవ్వుతూ రావాలని ఏడ్వకూడదని చందు చెప్పడంతో నవ్వేస్తుంది శ్రీవల్లి. ఇక వాళ్లు ఇంటికి రాగానే హారతితో ప్రేమ, నర్మద రెడీ అవుతారు. ఇంతలో వేదవతి, రామరాజుల కూతురు కామాక్షీ వచ్చి.. ఆగండి, హారతి నేను ఇస్తానని అంటుంది. లేదు.. నా కోడళ్లు ఇద్దరు ఇవ్వాలని వేదవతి అంటుంది. లేదు ఇంటి ఆడపడుచుగా నేనే ఇవ్వాలని కామాక్షి పట్టుబడుతుంది. ఎందుకని వేదవతి అడగ్గా.. హారతి ఇచ్చాక ప్లేట్ లో కట్నం పెడతారుగా వాటి కోసం అని కామాక్షి అనగానే రామరాజుతో సహా అందరు నవ్వేస్తారు. ఆ డబ్బులు నీకే కానీ ప్రేమ, నర్మదలని హారతి ఇవ్వమను అని కామాక్షికి వేదవతి చెప్పడంతో సరేనంటుంది.
కాసేపటికి ఆ ఇద్దరు కలిసి హారతి ఇవ్వడం ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమని కామాక్షి అడుగుతుంది. పెద్దోడు ఇచ్చిన డబ్బులు సరిపోవడం లేదని మారాం చేయడంతో రామరాజు ఆమెకి కావాల్సిన డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత కొత్త పెళ్లికొడుకు పెళ్లికూతురు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకోవడానికి తెగసిగ్గుపడతారు. శ్రీవల్లి సిగ్గుపడే సీన్ అయితే హైలైట్ అంతే. ఆ తంతు ముగిసిన తరువాత.. అత్తారింట్లో శ్రీవల్లి కుడికాలు పెట్టేస్తుంది. ఇక ఈ పెళ్లి తంతు అంతా చూసిన తర్వాత ప్రేమ, నర్మదలు మళ్లీ ఎమోషనల్ అవుతారు. ఇంతగొప్ప సంతోషాన్ని మేం కోల్పోయామని మళ్లీ బాధపడతారు. తమ పెళ్లిళ్ల విషయంలో జరిగిన గొడవల్ని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



