Illu illalu pillalu : భార్య నుదుటిన తిలకం దిద్దిన ధీరజ్.. వేదవతా మజాకా!
on Jan 23, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -63 లో.....నేను ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాను.. ఇప్పుడు నాపై మీకు ఇంకా ద్వేషం పెరిగింది. ఇది నేను భరించలేకపోతున్నాను.. ఎప్పటికైనా ద్వేషం తగ్గి అర్థం చేసుకుంటారని ఎదురుచూస్తుంటాను నాన్న అని ధీరజ్ అనుకుంటాడు. ఆ కళ్యాణ్ నమ్మి వెళ్లినందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేసావ్ దేవుడా అంటు దేవుడికి మొక్కుకుంటుంది ప్రేమ.
ప్రేమ దగ్గరున్నా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని సేనాపతి బాధపడతాడు. ఎందుకు ఏడుస్తున్నావని సేనాపతిని భద్రవతి అడుగుతుంది. నా కూతురిని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నందుకు తను ఇచ్చిన బహుమానమని సేనాపతి అంటాడు. ఎందుకు బాధపడుతున్నారు వెళ్ళాల్సిన ఇంటికి కోడలుగా వెళ్ళిందని పెద్దావిడ అంటుంది. అప్పుడే విశ్వ వచ్చి మీరేం బాధపడకండి.. చెల్లి మన ఇంటికి త్వరలోనే వస్తుందని అనగానే.. ఏంటి నిన్నటి నుండి ఇలాగే మాట్లాడుతున్నావ్.. వాళ్ళతో గొడవపెట్టుకుంటావా ఏంటని రేవతి అడుగుతుంది. మరోవైపు నర్మద జాతరలో ఏదైనా కొనివ్వమని సాగర్ ని అడుగుతుంది. సాగర్ చిరాకు పడుతుంటే.. నాకు తెలుసు సాగర్ నిన్ను దూరంగా ఉంచుతున్నానని కోపంగా ఉన్నావని కానీ కారణం ఎలా చెప్పాలని నర్మద అనుకొని.. సాగర్ వెంటపడుతు కొన్నివ్వమని అడుగుతుంది. ఏంటి రా అని చందు అడుగగా.. నాకు జాతరలో కోనివమంటే కొనట్లేదని నర్మద చెప్తుంది. కొనివ్వచ్చు కదా అని చందు, తిరుపతి అంటారు. తిరుపతి డబ్బులు తీసి సాగర్ కి ఇచ్చి.. ఏదైనా కోనివ్వమని చెప్తాడు.
ఆ తర్వాత ఇకనుండి మీ భార్యాభర్తల జీవితం మొదలు పెట్టండి. పూజ చెయ్యండి అని ప్రేమ, ధీరజ్ లకి వేదవతి చెప్తుంది. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వేదవతి ఒప్పించి ఇద్దరిచే పూజ చేపిస్తుంది. అది భద్రవతి కుటుంబం చూసి కోపంతో రగిలిపోతుంటారు. తరువాయి భాగంలో ధీరజ్ దగ్గరికి విశ్వ వచ్చి బావ అంటూ మాట్లాడతాడు. ధీరజ్ పై ఎటాక్ చెయ్యడానికి రౌడీ రెడీగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



