ENGLISH | TELUGU  
Home  » TV News

Illu Illalu Pillalu: గుండెనొప్పితో హాస్పిటల్ లో రామరాజు.. అమూల్య వెనుక ఉన్నది ఎవరు?

on Feb 3, 2026

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu Pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -384 లో... అమూల్య ఇంత మోసం చేసిందని రామరాజు బాధపడుతాడు. వేదవతి అయితే ఇంట్లో అన్ని వస్తువులు విసిరేస్తూ ఇంత ద్రోహం చేసింది.. ఎంత నమ్మాను.. దండం పెట్టి చెప్పానని ఏడుస్తుంది. అమూల్య.. అమూల్య అంటూ రామరాజు బాధపడతాడు. నా తల్లి అనుకున్నాను.. ఈ తండ్రిని మోసం చేసి వెళ్ళిపోయిందని రామరాజు కుప్పకూలిపోతాడు. 

 

మరొకవైపు అమూల్య, విశ్వలకి రేవతి హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది. అదే సమయంలో రామరాజుని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అదంతా భద్రవతి, సేనాపతి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు.

 

రామరాజుకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇస్తారు. వేదవతి ఏడుస్తుంది. డాక్టర్ వచ్చి తనకి తీవ్రమైన గుండె నొప్పి వచ్చింది.. అసలు ఏమైందని అడుగుతాడు. తన కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందని డాక్టర్ తో భాగ్యం చెప్తుంది. 

 

మరొకవైపు అమూల్య ఏడుస్తుంటే రేవతి వెళ్లి.. ఎందుకు ఏడుస్తున్నావ్.. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అని అడుగుతుంది. ఓహ్ మీ వాళ్ళకి దూరం అయ్యానని ఏడుస్తున్నావా? అయినా ఆ కుటుంబంలోకి వెళ్తే ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు.. నువ్వు కూడా అక్కడికి వెళ్లడం ఉండదని నీకు తెలియదా.. అయినా ఇదంతా ఎందుకు చేసావని రేవతి అడుగుతుంటుంది. పెద్దావిడ వచ్చి ఏం ప్రశ్నలు వేస్తున్నావ్ ఇన్నాళ్లకి ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసేందుకు వారధి అయిందని పెద్దావిడ అంటుంది. వేదవతి మాత్రం రామరాజుకి అలా అయిందని ఏడుస్తునే ఉంటుంది.

 

మరొకవైపు ఆ రామరాజు కూతురిని పెళ్లి చేసుకుని ఇన్ని రోజుల పగ తీర్చావని విశ్వ మెడలో గొలుసు వేస్తాడు సేనాపతి. విశ్వ అది కాదని ఏదో చెప్పబోతుంటే ఎవరు వినిపించుకోరు. ఇక ఆ పిల్ల.. ఈ ఇంట్లో కష్టాలు అనుభవిస్తుంటే.. ఆ రామరాజు గాడు తట్టుకోలేడని భద్రవతి అంటుంది. నోరు ముయ్ పగ పగ అంటావ్.. అది నీ చెల్లి కూతురు ఈ ఇంటికి కోడలు అని పెద్దావిడ చెప్తుంది. ధీరజ్ ఏడుస్తుంటే.. ఒరేయ్ ధీరజ్ ఏడవకురా అని ప్రేమ అంటుంది. దాంతో ప్రేమని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తాడు ధీరజ్. 

 

తరువాయి భాగంలో దీని వెనకాల ఎవరో ఉన్నారని ప్రేమతో ధీరజ్ అంటాడు. మరోవైపు అసలు నీ వెనకల ఎవరు ఉన్నారే తాళి కట్టకముందే కట్టానని మెడలో వేసుకొని వచ్చావని అమూల్యని విశ్వ అడుగుతాడు. అవును నా వెనకాల ఉన్నారని అమూల్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.