'కార్తీక దీపం'ను దాటేసి టాప్ 1 ప్లేస్‌లో 'గుప్పెడంత మనసు'!
on Dec 30, 2022

స్టార్ మాలో వచ్చే సీరియల్స్‌ని ఆదరించని ఆడియన్స్ లేరు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న డైలీ సీరియల్స్ తమదైన శైలిలో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే ఎలాంటి సీరియల్‌నైనా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఇకపొతే స్టార్ మాలో ప్రసారమయ్యే ధారావాహికలకు ఎక్కువ రేటింగ్ కూడా వస్తూ ఉంటుంది.
ఇందులో ప్రసారమయ్యే కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి, గుప్పెడంత మనసు, త్రినయని.. ఇలాంటి ఎన్నో సీరియల్స్ మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ రేటింగ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అందులోనూ ఎన్నో కొత్త కొత్త సీరియల్స్ కూడా లైన్ లోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఐతే ఇప్పుడు సాయికిరణ్ తాను నటిస్తున్న "గుప్పెడంత మనసు" సీరియల్ ప్రస్తుతం అర్బన్ మార్కెట్స్ లో టాప్ 1గా 9.77 రేటింగ్‌తో నిలిచింది.. అంటూ ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టుకుని మురిసిపోతున్నారు.
ఇక ఆ లిస్ట్ చూస్తే.. టాప్ 2లో కార్తీక దీపం (9.62), టాప్ 3లో త్రినయని (8.75), టాప్ 4లో ఇంటింటి గృహలక్ష్మి (8.59), టాప్ 5లో పడమటి సంధ్యారాగం (7.97) రేటింగ్‌తోతో ముందుకు దూసుకెళ్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



