Guppedantha Manasu : వసుధార కొత్త ప్లాన్ అదేనా.. షాక్ లో శైలేంద్ర!
on May 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1066 లో... రాజీవ్ ని శైలేంద్ర కలిసి మాట్లాడతాడు. అసలెందుకు నువ్వు బయటకు వస్తున్నావ్? వసుధారకి కన్పించావ్.. ఈ రోజు ఆ మనుకి కన్పించావ్? ఎందుకు ఇలా చేస్తున్నావని రాజీవ్ పై శైలేంద్ర కోప్పడతాడు. నేను దొరకను కదా అని రాజీవ్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతాడు. ఇలా ప్లాన్ చెయ్యడం.. అవి ఫెయిల్ అవ్వడం జరుగుతుందని శైలేంద్ర అంటాడు.
నువ్వు ఎందుకు భయపడుతున్నావంటూ శైలేంద్రని రాజీవ్ అడుగుతాడు. ఇప్పుడు నువ్వు అండర్ గ్రౌండ్ లో ఉంటే నీకు ప్రాబ్లమ్ ఏంటని శైలేంద్ర అంటాడు. అప్పుడే శైలేంద్రకి వసుధార ఫోన్ చేసి.. ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. ఏంటి రెస్పెక్ట్ తగ్గింది నేను చెప్పనని శైలంద్ర అనగానే.. శైలేంద్ర గారు ఎక్కడున్నారంటూ వసుధార మళ్ళీ అడుగుతుంది. బయటున్నానని శైలేంద్ర అనగానే.. మాట్లాడాలి కాలేజీ కి రండి అని వసుధార అంటుంది. ఆ తర్వాత శైలేంద్ర కాలేజీకి వెళ్తాడు. వాళ్ళున్న సిచువేషన్ లో నాతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని శైలేంద్ర అనుకుంటూ.. వసుధార క్యాబిన్ వరకు వస్తాడు. ఇక శైలేంద్ర రాకని గమనించిన వసుధార, మహేంద్ర ఇద్దరు కావాలనే మాట్లాడుకుంటారు.. ఇక ఎండీగా నేను ఉండను మావయ్య అని వసుధార అంటుంది. అలా అంటే ఎలా కాలేజీని చూసుకునే మను అలా చేసాడు.. అతను అలా చేసాడంటే ఇంకా నమ్మలేకపోతున్న అని మహేంద్ర అంటాడు.. శైలేంద్ర సర్ కి ఈ విషయం చెప్పాలని కాల్ చేసాను.. ఇంకా రావట్లేదు ఒకసారి ఫోన్ చేస్తానని వసుధార అనగానే.. శైలేంద్ర వెనక్కి వెళ్తాడు. ఏం విననట్టు.. వస్తున్నా అని శైలేంద్ర అంటాడు.
ఆ తర్వాత శైలేంద్ర వచ్చాక కూడా వసుధార ఎండీ పదవికి రీజైన్ చేస్తున్నానని అనగానే.. శైలేంద్రకి మొదట డౌట్ వచ్చినా వసుధార, మహేంద్ర మాటలతో నమ్మేలా చేస్తారు. ఆ తర్వాత అసలు నిజమేనా అని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత వసుధార బోర్డు మీటింగ్ ఎరేంజ్ చేసి.. అందులో కూడా ఈ విషయం చెప్తుంది. దాంతో శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.