బ్యాంకాక్ వెళ్లి వచ్చాకే డిప్రెషన్.. హాస్పిటల్ లో చేరిన గీతూ
on Apr 28, 2024
గలాటా గీతూ అన్నా గీతూ రాయల్ అన్నా ఆడియన్స్ కి ఇట్టే తెలిసిపోతుంది. బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఏదైనా చిన్న తప్పు జరిగితే చాలు వాళ్ళ మీద కరిసేస్తుంది... చిత్తూరు యాసతో అదరగొట్టే గీతూ పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అందుకే అసలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. ఫుల్ యాక్టివ్ గా ఉండడం లేదు. ఐదు నెలలుగా ఓ అనారోగ్య సమస్యతో బాధ పడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నానంటూ ఒక వీడియోలో పోస్ట్ చేసింది. రీసెంట్ గా ధనుష్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో గీతూ రాయల్ ఆరోగ్య పరిస్థితు గురించి చెప్పాడు. ముఖ్యంగా ఆమె డిప్రెషన్ లో ఉందని చెప్పాడు. ఐదారు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న గీతూ ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని చెప్పాడు.
ఇక ఈ వీడియోలో గీతూ రాయల్ మాట్లాడుతూ.. తాను బ్యాంకాక్ వెళ్లి అక్కడ దొరికిన అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసినట్లు చెప్పింది. దాని వల్లే తనకు ఈ ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండవచ్చని ఫీలయ్యింది. ఇది మాత్రమే కాకుండా తాను విజయవాడకు అమ్మ వారి దర్శనం కోసం వెళ్లినా దర్శించుకోలేదని, అలాగే తిరుచానూరుకు వెళ్లి కూడా దర్శించుకోకుండా వచ్చేసినట్లు వివరించింది. తన మూర్కత్వం వల్లే తనతో వచ్చిన వాళ్లు దర్శించుకోలేకపోయారని.. అందువల్ల కూడా తనకు ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చాయేమో అని అనుమానం వ్యక్తం చేసింది. కోటి మందిలో ఒకరికి వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తనకు వచ్చిందని బాధపడింది . సమంతకు వచ్చిన ఒక టైపు ఆఫ్ మాయోసైటిస్ లాంటింది తనకు కూడా వచ్చిందని వివరించింది. చిన్న చిన్న హాస్పిటల్స్ కి వెళ్తే అసలు విషయం తెలీలేదని పెద్ద హాస్పిటల్ కి రాగానే ఆ ఇన్ఫెక్షన్ బయట పడిందని చెప్పుకొచ్చింది. అలాగే దానికి రెండేళ్ల పాటు కంటిన్యూస్ గా ట్రీట్ మెంట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారని చెప్పింది .. ప్రతీ వారం ఇంజెక్షన్ చేయించుకోలేని చెప్పింది. ఈ సమస్య వల్ల తాను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు వివరించింది.
Also Read