Bigg Boss 9: ప్రేమించిన వాడు హింసించేవాడు.. ఫ్లోరా సైని ఎమోషనల్!
on Sep 8, 2025

బిగ్ బాస్ సీజన్-9 నిన్న గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే అందులోకి సెకెండ్ కంటెస్టెంట్ గా వెళ్లిన ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని గురించి తక్కువ మందికే తెలుసు. 'ప్రేమకోసం' సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేసింది ఫ్లోరా సైని. నరసింహానాయుడు సినిమాలోని లక్స్ పాప సాంగ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆ తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ పాత్రలో చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన '143' మూవీలోనూ నటించింది. (Flora Saini)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన ఈ భామ.. హీరోయిన్ అవకాశాలు రాకపోకవడంతో బాలివుడ్ కి వెళ్లింది. అక్కడ భిన్నమైన పాత్రలు చేసిన ఫ్లోరా సైని.. తమిళ, కన్నడ సినిమాలల్లోనూ నటించింది. తన ఇరవై ఏళ్ళ వయసులో ఒక ప్రొడ్యూసర్ తో ప్రేమలో పడినట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఫ్లోరా సైని. అయితే అతను తనని మానసికంగా, శారీరకంగా హింసించేవాడని, సినిమాలు చేయకూడదని బలవంతం చేశాడని, తన శరీరంపై గాయలతో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసినట్టుగా ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక సంవత్సరం పాటు ఎవరితో కాంటాక్ట్ లేకుండా చేశాడని, ఒకరోజు తన పొట్టపై తన్నడంతో ఆ నొప్పిని భరించలేకపోయానని, కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టిందంటూ ఎమోషనల్ అయింది ఫ్లోరా సైని.
బిగ్ బాస్ సీజన్-9 లో అడుగుపెట్టిన ఫ్లోరా సైనికి ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. తనకి ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-9 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



