ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoyindhi Manasu : అభి నాటకం రామలక్ష్మికి తెలిసేనా.. మాణిక్యం కొత్త ప్లాన్!

on Apr 16, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -72 లో.. రామలక్ష్మి నిద్ర నుండి లేచి.. సర్ నాకు ఏదో గిల్టీ గా ఉంది తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. ఇలా నాటకం ఆడడం నాకు బాధగా ఉంది. అభి ఫారెన్ వెళ్లగానే నన్ను కూడా త్వరగా పంపించండి అని సీతాకాంత్ కి రామలక్ష్మి చెప్తుంది. సరే అభి అక్కడకు వెళ్లి సెటిల్ అయిన వెంటనే నిన్ను పంపిస్తానని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్తాడు. అభిని ఫారెన్ ఎప్పుడు వెళ్తున్నావని అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు వెళ్తానని అన్నాడు. అంటే తన మాటలో అర్థం ఏమిటని సీతాకాంత్ అనుకుంటాడు.

మరొకవైపు అభి తన ఫ్రెండ్ తో ప్రొద్దునే డ్రింక్ చేస్తు ఉంటాడు. నేను రామలక్ష్మిని ఇష్టపడడానికి కారణం తన అందం తెలివి. తనకి ఉన్న తెలివితో ఫస్ట్ అటెంప్ట్ లోనే IAS అవుతుంది. అందుకే నేను కష్టపడకుండా తన భర్త పేరు తెచ్చుకోవచ్చని, సెటిల్ చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు.. కష్టపడకుండా దర్జాగా బ్రతకోచ్చని తన ఫ్రెండ్ కి అభి చెప్తాడు. కానీ సీతాకాంత్ సర్ రూపంలో అదృష్టం ముందే వచ్చింది.. రామలక్ష్మి తనకి భార్యగా నటిస్తున్నందుకు.. నాకు డబ్బులు ఇస్తున్నాడు.. ఇంకా సర్ ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటానని తన ఫ్రెండ్ కి  అభి చెప్తాడు. మరొకవైపు సీతాకాంత్ తనని మోసం చేసి.. సిరి, ధనలకి పెళ్లి చేసాడనే విషయాన్ని మాణిక్యం గుర్తుకుచేసుకుంటాడు. అప్పుడే సుజాత వచ్చి.. సరుకులు తీసుకొని రండి అని మాణిక్యంతో చెప్తుంది. మనకు ఇలా తెచ్చుకునే కర్మ ఎందుకు? మనం కూడా మన అల్లుడు ఇంట్లో ఉందామని మాణిక్యం అంటాడు. అలా ఎవరైనా ఉంటారా అని సుజాత అంటుంది. అయిన తన మాటలు వినకుండా సీతాకాంత్ ఇంటికి బయలుదేర్తాడు మాణిక్యం . ఆ తర్వాత సీతాకాంత్ తన చెల్లి సిరి, ధనలకి హనీమూన్ టికెట్ తీసుకొని వస్తాడు. హనీమూన్ కి వెళ్ళాల్సింది వాళ్ళిద్దరు కాదు.. నువ్వు రామలక్ష్మి కదా అని శ్రీలత అంటుంది. దాంతో సీతాకాంత్ టెన్షన్ పడుతు.. నాకు ఆఫీస్ లో చాలా వర్క్ ఉందని చెప్తాడు.

ఆ తర్వాత శ్రీలత ఎంత చెప్పిన వినకుండా.. నాకు ఆఫీస్ లో వర్క్ ఉందని అంటాడు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోలేదు.. లేదంటే హనీమూన్ కి వెళ్ళేవాళ్ళు కదా అని శ్రీలత , శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ దగ్గరికి మాణిక్యం వచ్చి.. మేమ్ ఇక్కడే ఉంటామని అంటాడు. దాంతో రామలక్ష్మి విని.. ఇలా ఉండడం కరెక్ట్ కాదని తిడుతుంది. ఏదైనా జాబ్ చెయ్ అని మాణిక్యంతో రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ విజిటింగ్ కార్డు ఇచ్చి.. అక్కడికి వెళ్లి జాబ్ లో జాయిన్ అవ్వమని‌ మాణిక్యంతో సీతాకాంత్ చెప్పగానే మాణిక్యం డిసప్పాయింట్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.