Eto Vellipoyindhi Manasu : కొడుకు ప్రేమ బాగోతం తెలుసుకున్న తల్లి.. ఏం చేయనుంది!
on May 8, 2024
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -90 లో.. నువ్వెందుకు ఆ రామలక్ష్మికి సారీ చెప్పావ్ మమ్మీ.. రామలక్ష్మి అభిల ప్రేమ గురించి మనకి నిజం తెలిసిపోయింది కదా.. ఇంకా ఎందుకు లేటు.. వెంటనే అందరి ముందు వాళ్ళ నాటకం బయటపెట్టి ఇంట్లో నుండి పంపించేయ్యాలని శ్రీలతతో సందీప్ అంటాడు.. అలా చెయ్యకూడదు ఎందుకంటే రామలక్ష్మిని సీతాకాంత్ ప్రేమిస్తున్నాడని చెప్పగానే.. నీకెలా తెలుసు మమ్మీ అంటూ సందీప్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత వాళ్ళ నాటకం గురించి ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వాళ్ళ రూమ్ కి వెళ్ళాను.. అక్కడ సీతకాంత్ తన డైరీలో రామలక్ష్మి ప్రేమ గురించి రాసాడు.. అంతేకాదు ప్రేమ అంటే మాములు ప్రేమ కాదు గత జన్మ బంధం అని ఫీల్ అవుతున్నాడని శ్రీలత చెప్తుంది. ఎట్టి పరిస్థితిలోను ఆ రామలక్ష్మి ఈ ఇంటికి కోడలు అవ్వడానికి వీలు లేదు. ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్ల రామలక్ష్మిని పంపించేయ్యడం కాదు.. రామలక్ష్మి, సీతాకాంత్ ల మధ్య గొడవలు క్రియేట్ చెయ్యడమని శ్రీలత అంటుంది. మరొకవైపు అభి పట్టపగలే పీడ కల కంటాడు. రామలక్ష్మిని అభి ఇంటికి సీతాకాంత్ తీసుకొని వచ్చినట్లు.. అభి నిజస్వరూపం రామలక్ష్మి తెలుసుకొని తనని కొట్టి కోపంగా వెళ్ళిపోయినట్లు కల కంటాడు.
మరొకవైపు రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వచ్చి టిఫిన్ చేద్దాం రమ్మని చేప్తాడు. నాకు ఆకలిగా లేదని రామలక్ష్మి అంటుంది.. ఆ తర్వాత సీతాకాంత్ భోజనం చేస్తుంటే.. నువ్వు అసలు ధనని కేర్ చెయ్యట్లేదు.. నిన్న జాబ్ చూసుకుంటున్నాడని చెప్తే సరే మంచిది అన్నావని అనగానే.. నేను ఏదో టెన్షన్ లో ఉండి ఆలా అన్నానని చెప్తూ.. వెంటనే ధనకి తన కంపెనీ లోనే జాబ్ ఇస్తాడు. నేను వెళ్లి వదినని తీసుకొని వస్తానంటు.. రామలక్ష్మి దగ్గరికి సిరి వెళ్తుంది. అన్నయ్య టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్తుంటే.. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి.. మీరు మా కోసం పెళ్లి చేసుకున్నారు. ఎవరు చేయని పని చేశారని రామలక్ష్మితో సిరి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



