Eto Vellipoyindhi Manasu : వాడి నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో సహా తనకి చూపించాలి!
on May 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -87 లో.. శ్రీలత సందీప్ ఇద్దరు అభిని కలుస్తారు. వాళ్ళని చూడగానే సీతా సర్ ఫ్యామిలీ వాళ్ళు అని టెన్షన్ పడుతాడు. మీరు ఎవరంటు ఏం తెలియనట్టు అభి మాట్లాడతాడు.. రామలక్ష్మి నీకు ఎలా తెలుసు.. నా కొడలితో రహస్యంగా మాట్లాడడం నేను చూసాను.. రామలక్ష్మి నువు లవర్స్ ఆ అని శ్రీలత అడుగుతుంది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. రామలక్ష్మి నేను మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని అభి చెప్పి వెళ్ళిపోతాడు.
వాడు ఫ్రెండ్స్ అంటున్నాడు కానీ వాడి కళ్ళలో భయం తెలుస్తుంది. ఎలా బయట పెట్టాలో నాకు తెలుసని శ్రీలత అంటుంది. ఆ తర్వాత అభి తన ఫ్రెండ్ తో వస్తు.. అసలు ఎందుకు వాళ్లకు నాపై డౌట్ వచ్చిందని అభి మాట్లాడతాడు. ఏది ఏమైనా సరే ఇక నుండి జాగ్రత్తగా ఉండాలని అభి అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత, సందీప్ ఇద్దరు ఇంటికి వస్తారు. హాల్లో ఉన్న రామలక్ష్మిని చూసి.. ఇప్పుడు నిన్ను ఎలా టెన్షన్ పెడుతానో చూడమని సందీప్ ని శ్రీలత ఫోన్ కి కాల్ చెయ్యమని చెప్తుంది. కావాలనే శ్రీలత, రామలక్ష్మి ముందు ఎవరు మాట్లాడేది.. అభి నా అని అంటుంది. అభి ఎవరు రాంగ్ నెంబర్ కి చేసావని అంటుంది రామలక్ష్మి, సిరి మీకు అభి అనేవాళ్ళు ఎవరైనా తెలుసా అని అడుగుతుంది. తెలియదని రామలక్ష్మి చెప్తుంది. నీ కళ్ళలో భయం కనపడుతుంది రామలక్ష్మి అని శ్రీలత మనసులో అనుకుంటుంది.
ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వచ్చి.. అభి వాళ్ళ అమ్మ అభి గురించి చెప్పిన మాటలు గుర్తుకుచేసుకొని .. అభి ఇంత మోసం చేస్తున్నాడు కానీ రామలక్ష్మి అతన్ని గుడ్డిగా నమ్ముతుంది ఎలా? ప్రూఫ్స్ తో అభి మోసగాడు అని రామలక్ష్మికి చెప్పాలని సీతాకాంత్ అనుకుంటాడు. మరొకవైపు అభి ఇంటికి వెళ్ళగానే.. సీతాకాంత్ వచ్చిన విషయం వాళ్ళ అభికి వాళ్ళ అమ్మ చెప్తుంది. దాంతో అభి కంగారు పడతాడు. ఎక్కడ రామలక్ష్మికి తన గురించి సీతా సర్ నిజం చెప్తాడోనని వెంటనే తన గురించి నెగటివ్ గా చెప్పకముందే.. సీతాకాంత్ గురించి నెగెటివ్ గా రామలక్ష్మికి చెప్పాలని ఫోన్ చేసి.. ఒక ప్లేస్ కి రమ్మని చెప్పగానే రామలక్ష్మి వస్తుంది. నాకు ఇంత డబ్బు ఇస్తున్నాడు దీని వెనకల సీత సర్ ఉదేశ్యం ఉందేమోనని అభి అంటాడు. నిన్ను నా నుండి దూరం చెయ్యడానికి నా గురించి ఏదైనా చెడుగా చెప్పొచ్చని అభి అంటాడు. లేదు సర్ మంచి వారు అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read