Eto Vellipoyindhi Manasu : మూడు రోజుల టైమ్ ఇచ్చిన పోలీసులు.. మోసం చేయలేదని సీతాకాంత్ నిరూపిస్తాడా!
on Jan 22, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -308 లో...... మాణిక్యం వచ్చి ఆఫీస్ దగ్గర అందరు గొడవ చేస్తున్నారని చెప్పడం తో రామలక్ష్మి, మాణిక్యం సీతాకాంత్ లు ఆఫీస్ కి బయల్దేర్తారు. అప్పుడే రామలక్ష్మి కి శ్రీలత ఫోన్ చేస్తుంది. జరుగుతున్న దానికి తనకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది లిఫ్ట్ చేసి మాట్లాడమని మాణిక్యం అంటాడు. దాంతో రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇదంతా కావాలని మీరే చేయించారా అని రామలక్ష్మి అడుగగా.. మరి లేనిది ఉన్నట్టు ఎలా అవుతుంది. అంతా నేనే చేశానని శ్రీలత అంటుంది.
రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంటే అవన్నీ చెప్పకు.. నీతో పాటు మీ ఆయన్ని కాపాడుకోమని శ్రీలత అంటుంది. ఫోన్ కట్ చేసాక ఇదంతా అత్తయ్య గారే చేశారట అని సీతాకాంత్ కి చెప్తుంది రామలక్ష్మి. అత్తయ్య నా మీద ఆయన మీద దాడి చేయించాలని చూస్తుందని మాణిక్యానికి చెప్తుంది రామలక్ష్మి . వాళ్ళ సంగతి నేను చూసుకుంటా మీడియా వాళ్ళ సంగతి మీరు చూసుకోండి అని మాణిక్యం చెప్తాడు. శ్రీలత ఆఫీస్ దగ్గర గొడవ చేసే వాళ్లలో కొంతమంది రౌడీలని పెట్టింది. వాళ్లు రాగానే నేను చెప్పినట్టు చెయ్యండని చెప్తుంది. అప్పుడే రామలక్ష్మి, సీతాకాంత్, మాణిక్యం లు ఆఫీస్ కి వస్తారు. అందరు గొడవ చేస్తుంటే ఆపే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్లు వినరు. పైగా వాళ్ళు సీతాకాంత్ ని రాళ్లతో కొడతారు.
గొడవ జరుగుతుంటే పోలీసులు వచ్చి వాళ్ళని ఆపుతారు. నాకు టైం ఇవ్వండి నేను అందరి డబ్బు ఇచ్చేస్తానని సీతాకాంత్ చెప్తాడు. మీపై కంప్లైంట్ వచ్చింది సర్ అరెస్ట్ చేస్తామని సీతాకాంత్ తో పోలీసులు అంటారు. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించు కోవడానికి అయినా నాకు టైమ్ కావాలని సీతాకాంత్ రిక్వెస్ట్ చెయ్యగా.. సరే మూడు రోజులు టైమ్ ఇస్తున్నామని పోలీసులు చెప్పి వెళ్లిపోతారు. రామలక్ష్మిని తీసుకొని శ్రీలత దగ్గరికి వెళ్తాడు సీతాకాంత్. ఇక బెల్ట్ తీసుకొని సందీప్, ధనలని కొడతాడు సీతాకాంత్ . శ్రీలత వాళ్లు ఎంత ఆపిన సీతాకాంత్ ఆపడు. నన్ను కొట్టి వాళ్ళని కొట్టమని శ్రీలత అనగానే సీతాకాంత్ ఆపుతాడు.. నా కొడుకుని, అల్లుడిని కొట్టె హక్కు నీకు ఎక్కడిదని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



