Eto Vellipoyindhi Manasu : మీ లాంటి రెండు మోహాలు ఉన్నవాళ్ళని చూడటం ఫస్ట్ టైమ్.. సవాలు విసిరిన కోడలు!
on Jun 25, 2024
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -131 లో.....రామలక్ష్మి ఇంటికి వచ్చేసరికి శ్రీలత హాల్లో కూర్చొని ఉంటుంది. సందీప్ తో శ్రీలత అన్న మాటలు రామలక్ష్మి గుర్తుకుచేసుకుంటుంది. మరొకవైపు సీతాకాంత్ ప్రసాదం తినకుండా రామలక్ష్మి అడ్డుకున్నది శ్రీలత గుర్తుకుచేసుకుంటుంది. అత్తయ్య గారు ఏంటి అలా చూస్తున్నారని రామలక్ష్మి అడుగుతుంది. ఈ వయసులో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా అని శ్రీలత అంటుంది. నీ మొగుడుని కాకా పట్టడానికి క్యారెజ్ తీసుకొని వెళ్ళావా అని శ్రీలత అనగానే.. అంటే మా భార్యభర్తల మధ్య గొడవ జరిగి విడిపోవాలి అనుకున్నారా అని రామలక్ష్మి అంటుంది. కిడ్నాప్ అయినప్పుటి నుండి నీలో తేడా వచ్చింది.. అదేంటని నేను అడగను.. కానీ నువ్వు నాగురించి తెలియక ఏదో చేసేస్తానంటూ మురిసిపోకని శ్రీలత అంటుంది.
నీలాంటి రెండు మొహాలున్న వాళ్ళని చూడడం ఫస్ట్ టైమ్ మిమ్మల్ని ఎలా ఎదర్కుంటానో చూడమని శ్రీలతకి రామలక్ష్మి సవాలు విసురుతుంది. రామలక్ష్మి మాటలు సీతాకాంత్ గుర్తుకుచేసుకుంటాడు. అప్పుడే పెద్దాయన వచ్చి నువ్వు ఇంకా ఆఫీస్ లో ఉన్నావా.. నీ భార్య తో టైమ్ స్పెండ్ చేయమని చెప్పాను కదా.. అప్పుడే తన మనసులో ఏముందో అప్పుడే తెలుస్తుందని పెద్దాయన అంటాడు. మరొకవైపు రామలక్ష్మి కావాలనే శ్రీలత ముందుకు వచ్చి.. సీతాకాంత్ కి ఫోన్ చేస్తుంది. ఏవండి నాకు బోర్ కొడుతోంది త్వరగా రండి.. సరదాగా బయటకు వెళదామని రామలక్ష్మి అనగానే సీతాకాంత్ ఆశ్చర్యపోతాడు. త్వరగా రండీ సినిమాకి వెళదామని రామలక్ష్మి అనగానే.. సీతాకాంత్ సరే అంటాడు. ఆ మాటలు విన్న శ్రీలత శ్రీవల్లి లు కుళ్ళుకుంటారు. ఏంటి తాతయ్య.. నువ్వే రామలక్ష్మికి చెప్పావా అని సీతాకాంత్ పెద్దాయనని అడుగుతాడు. నాకేం తెలియదని పెద్దాయన అంటాడు.
మీ ముందే ఎలా ఫోన్ మాట్లాడుతుందో చూశారా అంటూ శ్రీలతని శ్రీవల్లి రెచ్చుగొడుతుంది. అప్పుడే సీతాకాంత్ ఆఫీస్ నుండి వచ్చి.. డైరెక్ట్ రామలక్ష్మి దగ్గరకి వెళ్తాడు. చూసారా కనీసం మీ దగ్గరకి వచ్చి గాయం ఎలా ఉందని అడగట్లేడని శ్రీవల్లి అంటుంది. సీతాకాంత్ రాగానే రామలక్ష్మి రూమ్ డోర్ తీస్తుంది. రామలక్ష్మి అందంగా రెడీ అయి ఉండడంతో అలాగే చూస్తుంటాడు. వెళ్లి రెడీ అయి రండి అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ లు రెడీ అయి కిందకి వస్తారు. అప్పుడు శ్రీలత వాళ్ళని బయటకు వద్దని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



