Eto Vellipoindi Manasu: అభి కొత్త డీల్.. ఇంటర్వ్యూలో క్వాలిఫై కాలేకపోయిన ధన!
on May 14, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-95 లో.. సీతాకాంత్ ఆఫీస్ కి అభి వస్తాడు. రామలక్ష్మిని సీతాకాంత్, పెళ్ళి చేసుకోలేదని అదంతా నాటకమని చెప్పి ఓ వీడియో ఫుటేజ్ ని సీతాకాంత్ కి చూపిస్తాడు అభి.. అది చూసి అభి మీద కోపంతో పీకపట్టుకుంటాడు సీతాకాంత్. ఊటీలో ఓ రెసార్ట్ కావాలని డీల్ ఇస్తాడు అభి. కాసేపటికి రామలక్ష్మి ఆఫీస్ కి వస్తుంది.
అభి ఎందుకు నన్ను రమ్మని చెప్పావ్.. నిన్ను సీతాకాంత్ సర్ రావొద్దని చెప్పాడు కదా అని అభిని రామలక్ష్మి అడుగుతుంది. మనం ముగ్గురికి ఎవరో తెలియని శత్రువులున్నారని మన గురించి ఇలా చెడుగా ప్రచారం చేస్తున్నారంటూ ఓ వీడియోని చూపిస్తాడు. ఇక కాసేపు మాట్లాడి అభిని పంపించేస్తారు. ఇక మాణిక్యాన్ని తన క్యాబిన్ లో వేసి తాళం వేసి వెళ్తాడు. రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు కలిసి వెళ్ళేసరికి మాణిక్యం ఏదో క్లీన్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. కాసేపు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఇక అభి వచ్చినట్టు డౌట్ తో మాణిక్యం బయటకు వచ్చి చూడగా.. అప్పుడే అభి బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని మాణిక్యం అనుకుంటాడు. ఇక అప్పుడే సిరి, ధన ఇద్దరు కలిసి సీతాకాంత్, రామలక్ష్మిల దగ్గరికి వస్తారు. వదిన నువ్వు చాలా లక్కీ.. ఎందుకంటే మా అన్నయ్య ఒక్కసారి ప్రేమిస్తే చాలా బాగా చూసుకుంటాడని రామలక్ష్మితో సిరి చెప్తుంది. ఇక రామలక్ష్మి కాస్త ఇబ్బంది పడుతుంది. ఇక రామలక్ష్మి, సిరి ఇంటికి వెళ్తారు.
కాసేపటికి ధన ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ ముగ్గురు కలిసి సీనియర్ మేనేజర్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ తీసుకుంటారు. కొంతవరకు వాళ్ళు అడిగిన వాటికి సమాధానం చెప్పిన ధన.. ఇక సరైన ఆన్సర్స్ ఇవ్వలేకపోతాడు. నేనెవరినో తెలుసా సీతాకాంత్ సర్ కి బామ్మర్దిని, మరి మా బావ గారి ఆఫీస్ లో నాకు ఇంటర్వ్యూ ఏంటని ధన అటిట్యూడ్ చూపిస్తాడు. సర్ మీరు ఎవరైన సరే.. ఇది కంపనీ రూల్.. పైగా మీరు ఫ్రెషర్ అని ఒక ఇంటర్వ్యూ చేసే అతను అనగా.. మిస్టర్ ధన మీరు ఈ ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. సో మీరు సీనియర్ మేనేజర్ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదని అతను చెప్పగానే ధన షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read