ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoindi Manasu: బొమ్మని గీస్తే నీలాగుంది.. తనవల్ల ఇబ్బందిరాదని మాటిచ్చిన భర్త!

on Apr 28, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -83 లో.. సీతాకాంత్ కోపంగా రామలక్ష్మిని తీసుకొని లోపలికి వచ్చి.. నీ మైండ్ వర్క్ చెయ్యడం లేదా? మనం ఏ సిచువేషన్ లో ఉన్నాం.. నువ్వేం చేస్తున్నావ్? ఈ రాత్రి అభిని నువ్వు కలవడం అవసరమా అని రామలక్ష్మిని సీతాకాంత్ తిడతాడు. అంటే నన్ను చూడాలని అన్నాడు.. కన్నీరు పెట్టుకున్నాడని రామలక్ష్మి అంటుంది. అదంతా అభి కావాలనే చేస్తున్నాడు. లేకపోతే ఇంత రాత్రి రావడం అవసరమా? ఇంట్లో వాళ్ళు చూస్తే పరిస్థితి ఏంటని సీతాకాంత్ కోప్పడతాడు.

ఆ తర్వాత నువ్వు గనుక సొంత మనిషివి అయి ఉంటే నీపై చెయ్యి చేసుకునేవాడిని అంటు రామలక్ష్మిని సీతాకాంత్ కోప్పడతాడు. ఇక గొడవ జరిగి తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ పడకుంటారు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి రాత్రి సీతాకాంత్ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ కాఫీ తీసుకొని వస్తాడు. నాకూ వద్దని రామలక్ష్మి అంటుంది. ఓహ్ అలిగావా అని సీతాకాంత్.. ఒక పేపర్ పట్టుకొని బొమ్మ గీస్తుంటాడు. ఏం చేస్తున్నారని రామలక్ష్మి అడుగగా‌‌.. బొమ్మ గీస్తున్నాని సీతాకాంత్ చెప్తాడు. అవునా.. చూపించండి అని రామలక్ష్మి అడుగుతుంది. అది చూసి చిన్న పిల్లలు కూడా ఇంతకన్నా బాగా వేస్తారని రామలక్ష్మి నవ్వుతుంది. అబ్బా నవ్వావా.. నువ్వు డల్ గా ఉంటే నాకు ఏదోలా ఉంది. ఇప్పుడు మాటిస్తున్నాను..  నీకు నా వల్ల ఏదైనా ఇబ్బంది గానీ బాధ గానీ కలిగిన రోజు.. నీ అంతటా నువ్వు ఇంట్లో నుండి వెళ్లిపోవచ్చని రామలక్ష్మికి సీతాకాంత్ మాటిస్తాడు. అప్పుడే శ్రీలత వస్తుంది. ఆఫీస్ కి రెడీ అవుతానంటూ సీతాకాంత్ వెళ్ళిపోతాడు. నగలు మెరుగు పెట్టించాలి తీసుకొని రా రామలక్ష్మి అని శ్రీలత చెప్తుంది. రామలక్ష్మి వెళ్ళగానే తన ఫోన్ లో అభి నెంబర్ తీసుకుంటుంది. వీడి ద్వారా అన్ని నిజాలు తెలుసుకోవచ్చని శ్రీలత అనుకుంటుంది.

ఆ తర్వాత పింకీని మాణిక్యం తీసుకొని.. సీతాకాంత్ వాళ్ళ ఇంటికి వస్తాడు. పింకీ.. ధన,సిరీలతో మాట్లాడుతుంది‌. ఇక వెళదాం పదా ఈ అటెండర్ ఎక్కవసేపు ఇంట్లో ఉండకూడదని మాణిక్యం అంటాడు. ఆ తర్వాత సిరి కి సింపతీ కలగాలని అని భావించిన మాణిక్యం.. నీ మామ నీ అన్నయ్య కంపెనీలో అటెండర్ అని అంటాడు. దాంతో బాధగా ఫీల్ అయిన సిరి.. నేను అన్నయ్యతో మాట్లాడుతానని సిరి అంటుంది.. ఆ తర్వాత సీతాకాంత్ వస్తాడు. మాణిక్యం అతి వినయం నటిస్తుంటే.. అది ఆఫీస్ లో, ఇంట్లో నువ్వు మావయ్యవి‌. పదా టిఫిన్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు సీతాకాంత్ ‌.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.