సీసీటీవీలో భార్య మాజీ లవర్.. భర్తకి అంతా తెలిసిపోయిందా!
on Oct 30, 2024
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -239 లో....సిరి కోసం ఇంట్లో పూజ చేస్తుంటారు. పూజ జరుగుతుంటే అభి వస్తాడు. అభిని ఒక సీతాకాంత్ మాత్రమే చూస్తాడు. అసలు ఎందుకు వచ్చాడు. ఏం జరుగుతుందని సీతాకాంత్ ఆలోచిస్తాడు. అభి దగ్గరికి వెళ్ళబోతుంటే పూజ మధ్యలో లేవకూడదు బావగారు అని శ్రీవల్లి అంటుంది. ఏంటి సీతా ఏదో టెన్షన్ పడుతున్నవని శ్రీలత అనగానే.. ఏం లేదని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత పూజ పూర్తి అవుతుంది. శ్రీవల్లి నెక్లెస్ కోసం లోపలికి వెళ్లి నెక్లెస్ కన్పించడం లేదని అంటుంది. ఏమైందంటూ అందరూ అడుగుతారు. ఒకవేళ రామలక్ష్మి అక్క తీసిందేమో ఎందుకు అంటే నాకు ఇచ్చేటప్పుడు వద్దని అంది కదా అని శ్రీవల్లి అనగానే.. రామలక్ష్మి తనపై కోప్పడుతుంది. సీసీటీవీ చూస్తే తెలుస్తుంది కదా అని సందీప్ ఆన్ చేస్తాడు. అందులో అభి వచ్చినట్లు ఉంటుంది. తనని చూసి అందరూ షాక్ అవుతారు. మళ్ళీ వచ్చాడేంటి అని రామలక్ష్మి అనుకుంటుంది. వీడు అభి కదా ఎందుకు వచ్చాడని శ్రీవల్లి, సందీప్ లు అంటారు. ఎవరి కోసం వచ్చి ఉంటాడని శ్రీవల్లి అంటుంది. అభి గురించి రామలక్ష్మి నాకెందుకు చెప్పడం లేదని సీతాకాంత్ అనుకుంటాడు. నేను వెళ్లి చూసి వస్తాను వాడు ఇక్కడే ఉన్నాడేమో అని పెద్దాయన వెళ్తాడు.
ఆ తర్వాత నెక్లెస్ బయట దొరికిందని వాడు తీసుకొని వెళ్తుంటే పడిపోయిందేమోనని పెద్దాయన అంటాడు. ఆ తర్వాత సిరికి నెక్లెస్ ఇస్తాడు సీతాకాంత్. ఆ తర్వాత ఎలాగైనా రామలక్ష్మి సీతకాంత్ లని విడకొడతాను ఇక సీతాకాంత్ కి అనుమానం మొదలు అయిందని శ్రీవల్లి, సందీప్ లతో శ్రీలత అంటుంది. మరొకవైపు వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడని రామలక్ష్మి ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



