Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!
on Dec 20, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.
నువ్వు మనం చేయబోయే యాడ్ కి మోడల్ గా చెయ్యొచ్చు కదా అని రాజ్ అడుగుతాడు. నాకు ఇష్టం ఉండదు పైగా వాటి గురించి నాకేం తెలియదని కావ్య ఒప్పుకోదు. మరొకవైపు రేణుక, తన భర్తని స్టేషన్ కి పిలిపిస్తుంది అప్పు. మీరు నా దగ్గర అన్నీ చెప్పారా అని అడుగుతుంది. మీ కూతురు DNA కి, మీ ఆయన DNA కి మ్యాచ్ అవ్వడం లేదని అప్పు కోప్పడుతుంది. అంటే ఆయన నా రెండో భర్త పాపకి సొంత నాన్న కాదని రేణుక అంటుంది. మరి ఆ విషయం ముందే చెప్పాలి కదా అని అప్పు అనగానే.. అంటే రెండో భర్త అన్న విషయం ఎవరికి చెప్పద్దన్నాడు అని రేణుక అంటుంది. మీరు పాప గురించి కనుక్కొమ్మంటే నా భర్తని అనుమానిస్తున్నారని రేణుక అంటుంది. అదేం లేదని అప్పు అంటుంది. త్వరగా నా కూతురు గురించి కనుక్కోమని రేణుక రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే రాహుల్ వచ్చి ఏంటి రాహుల్ యాడ్ షూట్ అయిందా అని అడుగుతాడు. లేదు లాస్ట్ మినిట్ లో మోడల్ హ్యాండ్ ఇచ్చిందని రాజ్ చెప్తాడు.
అయ్యో ఇప్పుడు ఎలా అని రాహుల్ అనగానే రాజ్ కి ఇలాంటి విషయాల్లో అనుభవం చాలానే ఉంది.. ఒకరు చెప్పనవసరం లేదని రుద్రాణి అంటుంది. మరి ఇప్పుడు మోడల్ దొరికిందా అని ఇందిరాదేవి అడుగుతుంది. దొరికింది కానీ ఒప్పుకోవడం లేదని రాజ్ అనగానే ఎవరని అడుగుతాడు. ఇంకెవరు మీ మనవరాలు అని రాజ్ అంటాడు. కావ్య అయితే బాగుంటుందని అపర్ణ, ఇందిరాదేవి అంటారు. నాకు ఇష్టం లేదని కావ్య అంటుంది. ఎందుకు తనని అంతలా బ్రతిమిలాడుతున్నారని ధాన్యలక్ష్మి అంటుంది. నేను మోడల్ ని తీసుకొని వస్తానని ధాన్యలక్ష్మి లోపలికి వెళ్లి తనే అన్ని నగలు వేసుకొని వచ్చి మోడల్ గా స్టిల్స్ ఇస్తుంటే వద్దని ఇంట్లో వాళ్ళు భయపడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



