Brahmamudi : ధాన్యలక్ష్మి మాటలకి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన రాజ్, కావ్య!
on Feb 17, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -957 లో.... ధాన్యలక్ష్మి ట్రస్ట్ కి అడ్డు చెప్పడంతో కళ్యాణ్ పేరున సగం ఆస్తి రాసి ధాన్యలక్ష్మికి ఇవ్వాలని రాజ్, కావ్య డిసైడ్ అయి అదే విషయం ఇంట్లో అందరికి చెప్తారు. దాంతో అపర్ణ కోప్పడుతుంది. మీ గురించి కూడా ఆలోచించాలి కదా అని అపర్ణ అంటుంది. ఇంత ఆస్తి ఉన్నా మన మేలుకోరే వాళ్ళకి ఇంతవరకు ఏం చెయ్యలేదు. ఈ ట్రస్ట్ ద్వారా మేలు చేస్తే మన కుటుంబం ఎప్పుడు చిరకాలం అందరికి గుర్తుంటుందని రాజ్ చెప్తాడు.
అప్పుడే ధాన్యలక్ష్మి ఫోన్ లో అప్పు, కళ్యాణ్ కిడ్నాప్ చేసిన వీడియో చూసి షాక్ అవుతుంది. ఆపండి మీ నాటకాలు.. ఆస్తులు అడిగానని నా కొడుకు, కోడలిని కిడ్నాప్ చేస్తారా అని ధాన్యలక్ష్మి అనగానే అందరు షాక్ అవుతారు. రాజ్, కావ్య ఆ వీడియోని చూస్తారు. మాకేం తెలియదని రాజ్, కావ్య చెప్తారు. అయినా ధాన్యలక్ష్మి వినకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. పిన్ని వాళ్ళ గురించి మాకు తెలియదు.. వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చేవరకు మేం ఇంట్లో ఉండమని రాజ్, కావ్య పాపని తీసుకొని వెళ్ళిపోతారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ ని రుద్రాణి మనుషులు తాళ్లతో కట్టి బందిస్తారు. అప్పుడే రుద్రాణి రౌడీలకి ఫోన్ చేసి నేను చెప్పేవరకు వాళ్ళని వదిలిపెట్టకు అని చెప్తారు. మరొకవైపు పాపని తీసుకొని కావ్య, రాజ్ కలిసి రేవతి దగ్గరికి వెళ్తారు. జరిగింది మొత్తం రేవతికి చెప్తారు.
ఆ తర్వాత రేఖ, రాహుల్ కావాలనే ధాన్యలక్ష్మికి వినిపించేలా మాట్లాడుకుంటారు. ఆ రాజ్, కావ్య ఇద్దరు అప్పు, కళ్యాణ్ ని వెతకడానికి వెళ్ళలేదు. రేవతి ఇంట్లో హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసి రాజ్, కావ్య కిడ్నాప్ చేసారు కాబట్టి వెతకడం లేదని రేఖతో రాహుల్ అనడం ధాన్యలక్ష్మి వింటుంది. కోపంగా హాల్లో కీ వస్తుంది. డల్ గా కూర్చొని అపర్ణ ఉంటుంది. ఎందుకు ఈ నాటకాలు అంటూ మళ్ళీ తనకి ఇష్టం వచ్చినట్లు మాటలు అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



