లండన్ బ్రిడ్జ్ ముందు లవర్ ముద్దులిస్తేనా.. మానస్ అంటే ఇష్టం!
on Apr 27, 2025
దీపికా ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు అని ఊరికే అనరు. బుల్లితెర మీద దీపికా తన మాటలతో, నవ్వుతో, జోష్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతోంది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో ప్రీ ఫైనల్ లోకి అడుగుపెట్టగా, చెఫ్ మంత్ర సీజన్ 2 లో మాత్రం ఓడిపోయింది. ఇక ఇప్పుడు కాకమ్మ కథలు సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ చెఫ్ సంజయ్ తుమ్మతో పాటు దీపికా కూడా వచ్చింది. ఐతే ఇందులో హోస్ట్ తేజస్విని మడివాడ ఒక ఇంటరెస్టింగ్ రౌండ్ లో అడిగిన వాటికి దీపికా చెప్పిన ఆన్సర్ మాములుగా లేదు.
ఈ షోలో "మినిమం డిగ్రీ ఉండాలి" అనే రౌండ్ ని పెట్టారు. అందులో ఒక ఐదు పదాలు ఇచ్చి వాటితో ఒక వాక్యం చేయాలి అని చెప్పింది. దీపికాకి ఇచ్చిన పదాలు ఏంటి అంటే "లవర్, లండన్, ముద్దు, ఫుడ్డు, బెడ్డు" అని చెప్పి వాటితో ఒక వాక్యం చెప్పమంది. అప్పుడు దీపికా "నా 6th లవర్ తో లండన్ బ్రిడ్జ్ ముందు అందరూ చూస్తుండగానే అసలు సిగ్గు లేకుండా అన్నీ మర్చిపోయి నాకు ముద్దులిస్తే నాకు ఫుడ్ కూడా అవసరం లేదు...ఐతే లండన్ బ్రిడ్జ్ ముందు నిలుచుని నిలుచుని అలిసిపోతాను కాబట్టి బెడ్డు అవసరం నిద్రపోవడానికి" అని చాల సింపుల్ గా చెప్పేసరికి తేజస్వి వ్వాహ్ అంటూ మెచ్చేసుకుంది.
ఇప్పుడు చేస్తున్న బ్రహ్మముడి సీరియల్ లో మానస్ రోల్ కి సెట్ అయ్యే ఇంకో పర్సన్ ఎవరు అనేసరికి అమర్ దీప్ అని చెప్పింది. తన ఇష్టమైన కో- ఆర్టిస్ట్ మానస్ అంది. ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే న్యూస్ రీడర్ ని అయ్యేదాన్ని అని చెప్పింది. అలాగే తనకు తినడం ఇష్టమట, ఇంకా సీరియల్స్ చూడడం ఇష్టమట.. ఇలా దీపికా చాలా విషయాలు చెప్పింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
