నేను చేసినా చూపించలేదు..అందరు సెట్ చేసుకొని వచ్చారు!
on Sep 29, 2023

గతవారం నుండి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన సింగర్ దామిణి గురించే చర్చ జరుగుతుంది. తను అసలు ఎలా ఎలిమినేట్ అయింది? ఎందుకు అలా బయటకు వచ్చేసిందంటూ క్వశ్చనింగ్ తో పాటు తను హౌజ్ లో ఉన్న తీరుకి ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. అయితే అదే విషయం గురించి తెలుసుకోవడానికి దామిణితో బిత్తిరి సత్తి ఒక ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ చేశాడు. అందులో పలు ఆసక్తికరమైన అంశాలని మాట్లాడాడు బిత్తిరి సత్తి.
బిత్తిరి సత్తి.. అలియాస్ కావలి రవి కుమార్. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డిలోని చేవెళ్ల మండలం పామెన గ్రామంలో యాదమ్మ మరియు కావలి నర్సింహులు దంపతులకు జన్మించాడు. అతని తండ్రి గ్రామాల్లో నాటక ప్రదర్శన (బాగోతం మరియు యక్షగానం) చేసేవాడు. 5వ తరగతి వరకు స్వగ్రామంలో చదివి, ఉన్నత పాఠశాల విద్య కోసం చేవెళ్లకు వెళ్లాడు బిత్తిరి సత్తి. ఇంటర్మీడియట్ తర్వాత చదువుకు స్వస్తి పలికాడు. అతను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు ప్రజలను అనుకరించడం మరియు ఎగతాళి చేయడంలో దిట్ట అయ్యాడు. అతను తన స్నేహితులు మరియు తెలిసిన సర్కిల్‌లో ప్రాచుర్యం పొందాడు మరియు హైదరాబాద్‌లో నటన వృత్తిని కొనసాగించడానికి వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్ లో టీవీ యాంకర్ గా తనదైన వాక్ చాతుర్యంతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించాడు. బిత్తిరి సత్తి సోషల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నాడు. బిత్తిరి సత్తి.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ చేయగా అది క్లిక్ అయ్యింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ తో బిత్తిరి సత్తి చేసిన అల్లరి మామూలుగా లేదు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట ఇంటర్వ్యూ కూడా చాలా బాగా వైరల్ అయ్యింది. బిత్తిరి సత్తి తన మాటలతో మహేష్‌ను ఎంతగానో నవ్వించాడు.ఇక మహేష్ కూడా బిత్తిరి సత్తి తిక్క ప్రశ్నలకు.. బాగానే సమాధానమిచ్చాడు.
బిత్తిరి సత్తికి సొంతంగా 'బిత్తిరి సత్తి' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఇందులో ట్రెండింగ్ వీడియోలు, తన సొంత వ్లాగ్స్, టూర్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ జనాలకి దగ్గరగా ఉంటున్నాడు బిత్తిరి సత్తి. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన దామిణిని ఇంటర్వ్యూ చేశాడు సత్తి. అక్కడ ఎలా ఉంటుంది? అసలెందుకు ఇంత తొందరగా బయటకొచ్చారని దామిణిని సత్తి అడిగాడు. "అసలు అక్కడ మనం ఎంత చేసిన అది బయట చూపించట్లేదు. చాలా వరకు నన్ను నెగెటివ్ గా చూపించారు. లోపల ఆడే ఆట కంటే బయట కంటెస్టెంట్స్ యొక్క PR లు చేసేదే ఎక్కువ కన్పిస్తుంది. నేను అసలు ఏమీ ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. అందరు బయట నీట్ గా సెట్ చేసుకొని వెళ్ళారు. నాకేమీ తెలియదు. అందరు నన్ను బొద్దుగా ఉన్నావని ముందుగానే డిసైడ్ అయిపోయారు. టాస్క్ లో నన్ను ఆడనివ్వలేదు" అంటూ దామిణి చెప్పుకొచ్చింది. ఇలా కొన్ని ముఖ్యమైన విషయాలని దామిణి బిత్తిరి సత్తితో షేర్ చేసుకుంది. కాగా దామిణితో బిత్తిరి సత్తి చేసిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



