Podharillu : మహాకి హారతి ఇచ్చి ఆహ్వానించిన నారాయణ కుటుంబం.. చక్రిపై ఆమె ఫైర్!
on Jan 21, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -32 లో... నారాయణ వాళ్ళ అన్న కనిపిస్తాడు. చూశావా నా ఇంటిని ఎలా ముస్తాబు చేశారో.. నా ఇంటికి కోడలు రాదన్నారు.. గొప్పింటి కోడలు వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత మహాని తీసుకొని చక్రి ఇంటికి వస్తాడు. ఇల్లు వచ్చే కొద్దీ దూరంలో కన్నా కార్ ఆపి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. కార్ ముందు బాంబులు పాటలతో డాన్స్ చేస్తుంటారు. అదేంటి వాళ్ళు అలా చేస్తున్నారని మహా అంటుంది. పోలీసులు మనం పెళ్లి చేసుకున్నామని చెప్పారు కదా అని చక్రి అంటాడు. అయితే మనం ఏం ఇష్టపడి చేసుకోలేదు కదా అని మహా అంటుంది.
కానీ వాళ్ళకి తెలియదు కదా అని చక్రి అంటాడు. మహాని అందరు చూస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కార్ దిగి లోపలికి వెళ్తుంటే.. తాయారు ఇంకా వాళ్ల అన్నయ్య చూస్తారు. గొప్పింటి అమ్మాయిలాగా ఉందని తాయారు అంటుంది. ఇల్లు చూసి వెళ్ళిపోతుందిలే అని వాళ్ళ అన్నయ్య అంటాడు. గాయత్రి హారతి తీసుకొని వస్తుంది. అప్పుడే తాయారు వచ్చి హారతి విసిరేస్తుంది. ఎవరికి హారతి పడుతున్నావని అక్కడ నుండి లాక్కొని తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత కన్నా లోపలికి వెళ్లి హారతి తీసుకొని వచ్చి.. ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తాడు. అప్పుడే నారాయణ తాగేసి వచ్చి.. చూసారా నా ఇంటికి కోడలు రాదన్నారు కదా అని గర్వంగా చెప్తాడు.
మహా లోపలికి వెళ్తుంది. ఇల్లంతా చూసి.. చక్రి తన ఇంటి గురించి చెప్పింది గుర్తుచేసుకుంటుంది. మాధవ, కేశవ, కన్నాని మహాకి పరిచయం చేస్తాడు చక్రి. ఆ తర్వాత చక్రిని మహా పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. నేను వాడితో పెళ్లి ఇష్టం లేక తప్పనిసరి.. నిన్ను చేసుకున్నాను.. ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడికి వస్తే ఇలా చేస్తున్నారేంటని చక్రిపై మహా కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



