Brahmamudi : డాక్టర్ ని కలవకుండా ఆపిన రాజ్.. కళ్యాణ్ నిజం చెప్తాడా!
on Oct 3, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -841 లో... డాక్టర్ ని కలవడానికి కావ్య వెళ్తుంది. అయితే ఆ విషయం తెలుసుకున్న రాజ్ డాక్టర్ దగ్గర ఉండే నర్స్ కి కాల్ చేసి ఒక పది నిమిషాలు మేనేజ్ చేయ్.. నేను చూసుకుంటానని చెప్తాడు. దాంతో నర్స్ .. కావ్యని డాక్టర్ దగ్గరికి పంపకుండా వేరేవాళ్ళని పంపిస్తుంది. ఇక నర్స్ ని డాక్టర్ పిలిచి కావ్యని పంపించమని చెప్తుంది. బయట ఇతర పేషెంట్స్ ఉన్నారని తను వాష్ రూమ్ కి వెళ్ళిందని చెప్తుంది. ఇక బయటకి వచ్చిన నర్స్ ని కావ్య నిలదీస్తుంది. అందరిని లోపలికి పంపుతున్నారు.. నన్న ఆపుతున్నారేంటని నర్స్ ని కావ్య అడుగగా.. వాళ్ళు వెళ్ళాక వెళ్ళండి అని తను చెప్తుంది.
ఇక రాజ్ పటాన్ చెరు దగ్గర్లో ఉన్నానని నర్స్ తో అనగానే.. డాక్టర్ గారి అత్తగారిల్లు అక్కడే అని చెప్తుంది. దాంతో ఆ అడ్రెస్ తీసుకొని అక్కడికి వెళ్తాడు రాజ్. అక్కడికి వెళ్ళి డాక్టర్ గురించి నెగెటివ్ గా చెప్తాడు రాజ్. మీ కోడలికి మీరంటే భయం లేదు.. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా అదే అనుకుంటున్నారని అనగానే.. అదేం లేదని డాక్టర్ గారి అత్త అంటుంది. మరి నిరూపించండి అని రాజ్ అనగానే.. తను డాక్టర్ కి వీడియో కాల్ చేస్తుంది. దొంగ వచ్చాడు.. నన్ను కట్టేసి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడని డాక్టర్ తో తన అత్త చెప్తుంది. అది విని డాక్టర్ వెంటనే బయల్దేరి ఇంటికి వెళ్తుంది.
ఇక డాక్టర్ తో సరిగ్గా కావ్య మాట్లాడే సమయానికే ఫోన్ రావడంతో తను వెళ్ళిపోతుంది. దాంతో కావ్య డిస్సప్పాయింట్ అవుతుంది. ఇంటికి వెళ్తుంది. మరోవైపు కళ్యాణ్ తైలం తీసుకొని ఇంటికొచ్చి ఇందిరాదేవికి ఇస్తాడు. దాంతో ఇందిరాదేవి షాక్ అవుతుంది. నేను రాజ్ కి చెప్తే నువ్వు తీసుకొచ్చావేంటని ఇందిరాదేవి అడుగుతుంది. అన్నయ్యకి ఏదో పని ఉందంటూ వెళ్ళాడని కళ్యాణ్ చెప్తాడు. నాకు తైలం తీసుకురావడానికన్నా వాడికి ముఖ్యమైన పని ఏంటని ఇందిరాదేవి అంటుంది. అప్పటికే కావ్య ఉంటుంది. తనని చూసిన కళ్యాణ్.. ఏంటి వదిన డాక్టర్ ని కలవలేదు కదా అని అడుగుతాడు. అదేంటి నేను హాస్పిటల్ కి వెళ్ళానని నీకెలా తెలుసని కావ్య అడుగుతుంది. దాంతో కళ్యాణ్ షాక్ అయి.. వెంటనే స్వప్న వదిన చెప్పిందని చెప్తాడు. హాస్పిటల్ కి అయితే అక్క చెప్పిందని అనుకుందాం.. కానీ నేను డాక్టర్ ని కలవలేదని నీకెలా తెలుసు.. నేను ఇంకా ఎవరికి చెప్పలేదు కదా అని నీకెలా తెలుసని కావ్య అంటుంది. దాంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



